ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల పరిధిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి నాలుగో జాబితాను పోస్టల్ శాఖ జూన్ 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
దేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో భారత తపాలా శాఖ 40,889 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది.
ఏపీ జీడీఎస్ ఫలితాలు (నాలుగో జాబితా)..
తెలంగాణ జీడీఎస్ ఫలితాలు (నాలుగో జాబితా)..
జూన్ 16 లోగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి...
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు జూన్ 16లోగా సంబంధిత డివిజన్ హెడ్ ముందు తమ సర్టిఫికేట్లను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటాక ఎట్టిపరిస్థితుల్లోనూ ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతించరు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను, ఒక జత జిరాక్స్ కాపీలను, ఫోటోలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
పోస్టులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
తపాలా శాఖలో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి స్పెషల్ సైకిల్ మే-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 12,828 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి. దీంతో పాటు మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి మే 22 నుంచి జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాలి.
నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.72 వేల వరకు జీతం!
తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..