కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు శుభవార్త. భారత పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పోస్టల్ సర్కిల్‌లలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దాదాపు 28,740 ఖాళీలను భర్తీ చేయనుంది. 

Continues below advertisement

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు జనవరి 31, 2026 నుండి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్రాంచ్ పోస్టల్ ఆఫీసర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టల్ ఆఫీసర్ (ABPM), మెయిల్ పంపిణీ చేసే గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఎలాంటి రాత పరీక్ష లేదుఈ ఉద్యోగ నోటిఫికేషన్‌లో అతిపెద్ద హైలైట్ పరీక్ష లేకపోవడమే. సాధారణంగా, ప్రభుత్వ ఉద్యోగాలు కఠినమైన పోటీ పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు. అయితే, ఈ పోస్టల్ శాఖ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష ఉండదు.

Continues below advertisement

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?10వ తరగతిలో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ జాబితా తయారు చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితిలో సడలింపు కూడా ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టంగా తెలిపారు. 

ఈ పోస్టులకు జీతం ఎంత?

ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం కూడా ఇవ్వనున్నారు. పోస్టల్ శాఖ నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్, డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ. 10,000 నుండి రూ. 24,470 వరకు వేతనం చెల్లిస్తారు. బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్ (BPM) పోస్టులకు రూ. 12,000 నుండి రూ. 29,380 వరకు ప్రతినెలా జీతం చెల్లిస్తారని నోటిఫికేషన్ తెలిపింది. 

ముఖ్యమైన తేదీలు

 జనవరి 31, 2026న ఈ పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14, 2026గా నిర్ణయించారు. పరీక్ష రుసుము చెల్లించడానికి ఫిబ్రవరి 16 వరకు అభ్యర్థులకు గడువు ఇచ్చారు. దరఖాస్తులో ఏదైనా తప్పిదం ఉంటే, దానిని సరిదిద్దుకోవడానికి ఫిబ్రవరి 18, 19 తేదీలలో అవకాశం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మెరిట్ జాబితా ఫిబ్రవరి 28, 2026న విడుదల చేయనున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ indiapostgdsonline.gov.inను సందర్శించి మీ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు చివరి నిమిషంలో సర్వర్ సమస్య తలెత్తకుండా ఉండాలంటే, ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి మార్కులు మాత్రమే మెరిట్ గా చూస్తారు కనుక  అవసరం కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సైతం ఇది ఒక సువర్ణావకాశం.

మరిన్ని వివరాలకు: indiapostgdsonline.gov.in వెబ్‌సైట్ సందర్శించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. రైల్వే శాఖ తరహాలో పోస్టల్ శాఖ సైతం ఒకేసారి భారీ మొత్తంలో పోస్టులను భర్తీ చేస్తుంది. కేంద్ర సర్వీసులు కనుక యువత సైతం ఈ పోస్టుల కోసం ఆసక్తి చూపుతారు.