తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేన్లలో పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌/ రిసెర్చ్‌/ ఇండస్ట్రియల్‌ అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. 


వివరాలు..


అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ - I,II)


విభాగాలు:


1. కెమికల్ ఇంజినీరింగ్


2. కెమిస్ట్రీ


3. సివిల్ &ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్


4. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్


5. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్


6. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్


7. మ్యాథమెటిక్స్&స్టాటిస్టిక్స్


8. మెకానికల్ ఇంజినీరింగ్


9. ఫిజిక్స్


అర్హత: సంబంధిత స్పెషలైజేన్లలో పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌/ రిసెర్చ్‌/ ఇండస్ట్రియల్‌ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.


వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1కు 38 ఏళ్లలోపు ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2కు 35 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.


జీతం: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1: నెలకు రూ.101500. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ - II: 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.75300, 1 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.73100, ఫ్రెష్ పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ.70900.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07.12.2022


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.12.2022


Notification 


Application 


Website


Also Read: 


ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Navy Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
ఏపీలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల పరిధిలో 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్ పాసై, డిగ్రీ చదువుతూ ఉండాలి. ఈ ఉద్యోగాల భర్తీకి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డిసెంబరు 14న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు 2023 జనవరి 18న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న రాతపరీక్ష నిర్వహించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...