IIITDM Recruitment: కాంచీపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(ట్రిపుల్ ఐటీడీఎం) వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 12 వరకు దరఖాస్తులు పమర్పించవచ్చు.

వివరాలు..

* అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్- I

* అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్- II

ఖాళీల సంఖ్య: 24

డిపార్ట్‌మెంట్/స్ట్రీమ్..

➥  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CS)

➥ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (EC)

➥ మెకానికల్ ఇంజినీరింగ్ (ME)

➥ స్కూల్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ (SIDI)

➥ ఫిజిక్స్ (PH)

➥ మ్యాథమెటిక్స్ (MA)

➥ ఇంగ్లీష్ (EN)

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్- I పోస్టులకు 40 సంవత్సరాలు మించకూడదు. ⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్- II పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు. 

జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్-1కు రూ.1,01,500 - రూ.1,67,400, గ్రేడ్-2కు రూ.71,000 - రూ.1,17,200.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, సెమినార్‌ ప్రెజంటేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

స్కాన్ చేసి అప్‌లోడ్ చేయవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్‌లు..

➥ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్

➥ ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్)

➥ బర్త్ సర్టిఫికెట్/ SSLC / 10వ తరగతి మార్కుషీట్

➥ కేటగిరీ సర్టిఫికేట్(ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ-ఎన్‌సీఎల్ / ఎస్సీ / ఎస్టీ) ఈడబ్ల్యూఎస్  అండ్ ఓబీసీ-ఎన్‌సీఎల్ 01.04.2024న లేదా తర్వాత తేదీగా ఉండాలి.

➥ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ (వర్తిస్తే)

➥ ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ (వర్తిస్తే)

➥ ప్రస్తుత యజమాని నుండి NOC (వర్తిస్తే)

➥ జనవరి/ఫిబ్రవరి 2025 పే స్లిప్

➥ అన్ని విద్యార్హతలకు సంబంధించిన మార్కు షీట్లు

➥ అన్ని విద్యా అర్హతల సర్టిఫికెట్లు

➥ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్

➥ పరిశ్రమ / R&D ల్యాబ్‌లో ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్

➥ యజమానిచే ధృవీకరించబడిన ప్రూఫ్ అఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పీరియన్స్

➥ ఆమోదించబడిన/ప్రచురితమైన జర్నల్ పేపర్లు

➥ ఎంప్లాయర్ ద్వారా ధృవీకరించబడిన ప్రూఫ్ అఫ్ పీహెచ్‌డీ రీసెర్చ్ సూపర్‌విజన్ 

➥ సాంక్షన్ ఆర్డర్ లేదా యజమాని ధృవీకరించిన ప్రూఫ్ అఫ్ స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ / ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ 

➥ ప్రూఫ్ అఫ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ / వర్క్‌షాప్స్/ FDP- యజమాని ధృవీకరించినది.

➥ ప్రూఫ్ అఫ్ పేటెంట్ ఫీల్డ్ / పబ్లిష్‌డ్ / గ్రాంటెడ్

➥ డిపార్ట్‌మెంట్ హెడ్ సర్టిఫికేట్ చేసిన టీచింగ్ లాబొరేటరీలకు మాన్యువల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ / కంప్యూటేషనల్ ప్రాజెక్ట్‌లు

➥ HoD ధృవీకరించిన ప్రత్యక్ష పారిశ్రామిక సమస్యలపై ప్రూఫ్ అఫ్ ఎంటెక్., ఎండీఈఎస్. ఎంఎస్సీ, బీటెక్, బీడీఈఎస్ ప్రాజెక్ట్ పర్యవేక్షణ

➥ అన్ని ప్రచురణల జాబితా - ప్రతి ప్రచురణకు చేర్చవలసిన DOI

➥ అభ్యర్థి రెజ్యూమ్.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.03.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..