ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మార్చి 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 114


* స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు


విభాగాలవారీగా ఖాళీలు: డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఎమర్జింగ్ పేమెంట్స్-51 పోస్టులు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ & ఎంఐఎస్-63 పోస్టులు.


పోస్టుల వారీగా ఖాళీలు..


➥ మేనేజర్: 75 పోస్టులు


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీసీఏ/ బీటెక్/ బీఎస్సీ/ బీఈ/ ఎంబీఏ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 04 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 01.01.2023 నాటికి 25-35 ఏళ్లు వయసు ఉండాలి. 02.01.1988 - 01.01.1998 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 


జీతభత్యాలు: నెలకు రూ.48,170-రూ.49,910 చెల్లిస్తారు.


అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 29 పోస్టులు


అర్హత:  సంబంధిత స్పెషలైజేషన్‌లో బీసీఏ/ బీటెక్/ బీఎస్సీ/ బీఈ/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంబీఏ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 7 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 01.01.2023 నాటికి 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి.  02.01.1983 - 01.01.1995 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 


జీతభత్యాలు: నెలకు రూ.63,840-రూ.73,790 చెల్లిస్తారు.


➥ డిప్యూటీ జనరల్ మేనేజర్: 10 పోస్టులు


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీసీఏ/ బీటెక్/ బీఎస్సీ/ బీఈ/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 01.01.2023 నాటికి 35-45 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1978 - 01.01.1988 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 


జీతభత్యాలు: నెలకు రూ.76,010-రూ.84,890 చెల్లిస్తారు.


దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.


ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ముఖ్యమైన తేదీలు..


➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.02.2023.


➥ దరఖాస్తు చివరి తేది: 03.03.2023.


Notification


Website



Also Read:


స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 152 పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్), ఒప్పంద/ డిప్యూటేషన్ ప్రాతిపదికన కోచ్, సీనియర్ కోచ్, చీఫ్ కోచ్, హై పెర్ఫార్మెన్స్ కోచ్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా  లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 3లోపు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐఎల్‌బీఎస్‌‌లో 260 ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్(ఐఎల్‌బీఎస్) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...