ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు జులై 11న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు అభ్యర్థుల కటాఫ్ మార్కుల వివరాలను కూడా కేటగిరీలవారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.


ఈ పరీక్ష జులై 2న కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ముఖ్య కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఉద్యోగానికి ఎంపికైతే నెలకు రూ.29,000 నుంచి రూ.34,000 జీతం చెల్లిస్తారు.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


 


కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులు


వివరాలు..


* ఎగ్జిక్యూటివ్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 1036 


పోస్టుల కేటాయింపు: ఎస్సీ-160, ఎస్టీ-67, ఓబీసీ-255, ఈడబ్ల్యూఎస్‌-103, యూఆర్‌- 451.


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.05.2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


సీజీఎల్‌ఈ-2023 'టైర్-1' అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌)-2023 టైర్-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. రీజియన్లవారీగా అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సీజీఎల్‌ 'టైర్‌-1' పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జులై 14 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మ‌ల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial