బెంగళూరులోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్‌ఫర్మాటిక్స్ అండ్ రిసెర్చ్(ఎన్‌సీడీఐఆర్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి ఇంటర్/ బీఈ/ బీటెక్/ ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఎస్/ మాస్టర్స్‌డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 7 వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ/ పర్సనల్ డిస్కషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 14
1) ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి: 05 పోస్టులు (మెడిలక్-4, నాన్ మెడికల్-1)
2) రిసెర్చ్ అసోసియేట్: 01 పోస్టు
3) కంప్యూటర్ ప్రోగ్రామర్: 02 పోస్టులు
4) ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్: 02 పోస్టులు
5) డేటా ఎంట్రీ ఆపరేటర్: 04 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్/ బీఈ/ బీటెక్/ ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఎస్/ మాస్టర్స్‌డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 25-40 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తు నింపి, ఫోటో అతికించి, స్కాన్ కాపీని ఈమెయిల్ ద్వారా పంపాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ/ పర్సనల్ డిస్కషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.17000-రూ.68875 చెల్లిస్తారు.
ఈమెయిల్: adm.ncdir@gov.in
దరఖాస్తుకు చివరి తేది: 07.03.2023.
Also Read:
డీఏవో పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్‌లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2, పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
హెచ్‌సీఎల్‌లో 24 మేనేజ్‌మెంట్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు
కోల్‌కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లను ఫిబ్రవరి 20న అధికారులు విడుదల చేశారు. వాస్తవానికి ఫిబ్రవరి 15న విడుదల కావాల్సిన అడ్మిట్ కార్డులు సాంకేతిక కారణాల వల్ల 5 రోజులు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..