NIN Recruitment: హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టులకు నోటిఫికేసన్ విడుదల చేసింది. దీనిద్వారా 05 పోస్టులని భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంఎల్‌టీతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 05
⏩ జూనియర్ మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఎంబీబీఎస్, ఆయూష్, బీడీఎస్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.60,000+ 15000(FDA).
⏩సీనియర్ రిసెర్చ్ ఫెలో: 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఎంఎస్సీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ( ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ సైన్స్, సోషల్ వర్క్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.44,450+ 12000(FDA).
⏩ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైన్స్(బయోకెమిస్ట్రి, మైక్రోబయాలజీ), సోషల్ వర్క్‌తో తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.32,000+ 12000(FDA).
⏩ ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఎంఎల్‌టీ లేదా డీఎంఎల్‌టీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.31,000+ 12000(FDA).
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్: suryachuka@gmail.com
ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేది: 24.04.2024.
ALSO READ:
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎపుడంటే
AAI Recruitment 2024: న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్- 2024 స్కోరు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. గేట్ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
నిట్-కురుక్షేత్రలో ఫ్యాకల్టీ పోస్టులు, ఈ అర్హతలుండాలి
NITK Recruitment: కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.