డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్ఆర్ఐ) ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఎస్సీ, డాక్టోరల్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 10, 11 వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 15


* ఫెలోషిప్‌ పోస్టులు.


⏩ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌


⏩ సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో


⏩ సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో


⏩ జూనియర్ రిసెర్చ్‌ ఫెలో


⏩ జూనియర్ ప్రాజెక్ట్‌ ఫెలో


⏩ డేటాబేస్ మేనేజర్


⏩ ఫీల్డ్‌ అసిస్టెంట్‌


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఎస్సీ, డాక్టోరల్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 1.06.2023 నాటికి ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులకు 45 సంవత్సరాలు, ఎస్‌ఆర్‌ఎఫ్/ఎస్‌పీఎఫ్ పోస్టులకు 32 సంవత్సరాలు, జేఆర్‌ఎఫ్‌/జేపీఎఫ్ పోస్టులకు 28 సంవత్సరాలు, డేటాబేస్ మేనేజర్ పోస్టులకి 35 సంవత్సరాలు ఉండాలి.  ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఓబీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.17000-రూ.78000 చెల్లిస్తారు.


ఇంటర్వ్యూ వేదిక: బోర్ట్‌ రూమ్‌, ఎఫ్‌ఆర్‌ఐ మెయిన్‌ బిల్డింగ్‌, పీఓ న్యూఫారెస్ట్‌, ఎఫ్ఆర్‌ఐ, దెహ్రాదూన్‌ 248006.


ముఖ్యమైన తేదీలు..


ఇంటర్వ్యూ తేది: 10, 11.08.2023.


ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9గంటలకు.


Notification


Website


ALSO READ:


ఏపీలో 39 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ, కేంద్రం వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల బోధనకు సంబంధించి 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలపై ఆగస్టు 2న రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణదేవి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఏపీలో 2020-21 విద్యాసంవత్సరంలో 22,609 ఖాళీలు ఉండగా.. 2021-22 విద్యాసంవత్సరం నాటికి 38,191కి చేరాయి. ఇక 2022-23 విద్యాసంవత్సరానికి మొత్తం ఖాళీల సంఖ్య 39,008కి పెరిగినట్లు ఆమె వెల్లడించారు. అంటే రాష్ట్రంలో రెండేళ్లలో ఖాళీలు 16,399 మేర పెరిగాయి. 1,56,895 టీచర్‌ పోస్టులకుగాను ప్రస్తుతం 1,17,887 మంది పనిచేస్తున్నట్లు అన్నపూర్ణదేవి తెలిపారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


సీజీఎల్ 2023 'టైర్-1' ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌)-2023 టైర్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. 
ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..


యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్ పరీక్షల షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెష‌న్లలో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరీక్షలు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా  మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ప్రిలిమ్స్ పరీక్షను మే 28న నిర్వహించగా.. జూన్‌ 12న ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...