బ్యాంకు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఐబీపీఎస్ (Institute of Banking Personnel Selection) గుడ్ న్యూస్ అందించింది. 2021 సంవత్సరానికిగానూ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ X (సీఆర్‌పీ X) ద్వారా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (ఆర్ఆర్‌బీ) ఖాళీగా ఉన్న 10,447 ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ జూన్ 8వ తేదీన ప్రారంభమవ్వగా.. జూన్ 28వ తేదీతో ముగియనుంది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమనరీ పరీక్ష ఆగస్టు నెలలో, మెయిన్ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో జరగనుంది. పూర్తి వివరాలకు https://www.ibps.in/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
పరీక్ష విధానం:
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్), ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు ప్రిలిమనరీ పరీక్ష ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పరీక్షలో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ సబ్జెక్టులు ఉంటాయి. ఆఫీసర్ స్కేల్ 1 పరీక్షలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి. ప్రతి విభాగంలో 40 మార్కుల చొప్పున రెండింటికీ కలిపి మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ ప్రశ్నలు అన్నీ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రిలిమనరీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి మెయిన్ పరీక్ష ఉంటుంది.
మెయిన్ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్), ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ పరీక్షలో రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబులిటీ, లాంగ్వేజ్ పేపర్ ఉంటాయి. ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ రెండు పరీక్షల్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దీని ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
విద్యార్హత:
పోస్టును బట్టి విద్యార్హత మారుతుంది. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ఱతతో పాటు సంబంధిత అనుభవం కూడా ఉండాలి.
మరిన్ని వివరాలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్:https://www.ibps.in/
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08-06-2021
దరఖాస్తులకు చివరి తేది: 28-06-2021
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2021
మెయిన్ పరీక్ష: సెప్టెంబర్ / అక్టోబర్, 2021
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175, మిగతా వారికి రూ.850
పోస్టుల వివరాలు:
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) - 5096
- ఆఫీసర్ స్కేల్-1 - 4119
- ఆఫీసర్ స్కేల్-2 (అగ్రికల్చర్ ఆఫీసర్) - 25
- ఆఫీసర్ స్కేల్-2 (మార్కెటింగ్ ఆఫీసర్) - 43
- ఆఫీసర్ స్కేల్-2 (ట్రెజరీ మేనేజర్) - 10
- ఆఫీసర్ స్కేల్-2 (లా) - 27
- ఆఫీసర్ స్కేల్-2 (సీఏ) - 32
- ఆఫీసర్ స్కేల్-2 (ఐటీ) - 59
- ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) - 905
- ఆఫీసర్ స్కేల్- 3 - 151