HRRL Recruitment of Engineering Professionals: రాజస్థాన్‌లోని హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (జాయింట్ వెంచర్ కంపెనీ) జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఇంజినీరింగ్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 121 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 08 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 121.
⏩ జూనియర్ ఎగ్జిక్యూటివ్: 80 పోస్టులువిభాగం: కెమికల్.అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.జీతం: నెలకు రూ.30,000- రూ.1,20,000.
⏩ ఇంజినీర్: 03 పోస్టులువిభాగం: ఇన్‌స్ట్రుమెంటేషన్.అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 29 సంవత్సరాలు మించకూడదు.జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000.
⏩ ఇంజినీర్: 03 పోస్టులువిభాగం: ఎలక్ట్రికల్.అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 29 సంవత్సరాలు మించకూడదు.జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000.
⏩ ఆఫీసర్: 01 పోస్టువిభాగం: ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్.అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంపీఎస్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 29 సంవత్సరాలు మించకూడదు.జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000.
⏩ సీనియర్ ఇంజినీర్: 11 పోస్టులువిభాగం: ప్రాసెస్(రిఫైనరీ).అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 34 సంవత్సరాలు మించకూడదు.జీతం: నెలకు రూ.60,000-రూ.1,80,000.
⏩ సీనియర్ మేనేజర్: 04 పోస్టులువిభాగం: ప్రాసెస్(రిఫైనరీ).అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.జీతం: రూ.80,000- రూ.2,20,000.
⏩ సీనియర్ మేనేజర్: 03 పోస్టులు విభాగం: ప్రాసెస్ (ఆఫ్‌సైట్ & ప్లానింగ్)అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.జీతం: రూ.80,000- రూ.2,20,000.
⏩ సీనియర్ మేనేజర్: : 01 పోస్టువిభాగం: టెక్నికల్ ప్లానింగ్ (రిఫైనరీ & పెట్రోకెమికల్)అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.జీతం: రూ.80,000- రూ.2,20,000.
⏩ సీనియర్ మేనేజర్: 01 పోస్టువిభాగం: ప్రాసెస్ సేఫ్టీ & ఎన్కాన్అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.జీతం: రూ.80,000- రూ.2,20,000.
⏩ సీనియర్ మేనేజర్: 01 పోస్టువిభాగం: క్వాలిటీ కంట్రోల్ (రిఫైనరీ / పెట్రోకెమికల్).అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.జీతం: రూ.80,000- రూ.2,20,000.
⏩ సీనియర్ మేనేజర్: 08 పోస్టులువిభాగం: మెకానికల్.అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.జీతం: రూ.80,000- రూ.2,20,000.
⏩ సీనియర్ మేనేజర్: 03 పోస్టులువిభాగం: ఇన్‌స్ట్రుమెంటేషన్.అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.జీతం: రూ.80,000- రూ.2,20,000.
⏩ సీనియర్ మేనేజర్: 02 పోస్టులువిభాగం: ఫైర్ & సేఫ్టీ.అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.జీతం: రూ.80,000- రూ.2,20,000.
దరఖాస్తు ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:17.01.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.02.2025.