Hawkins Recruitment: ముంబయిలోని హాకిన్స్ కుక్కర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (మెకానికల్, ఎలక్ట్రికల్, టూల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్, ప్రొడక్ట్ డిజైన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్, క్వాలిటీ కంట్రోల్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెన్సార్స్, రోబోటిక్స్). డిగ్రీ ఫ్రెషర్లు కూడ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* మేనేజ్‌మెంట్ ట్రైనీలు
విభాగాలు..
➥ సేల్స్/ మార్కెటింగ్
➥ టెక్నికల్/ ఇంజినీరింగ్
➥ అకౌంట్స్
➥ కమర్షియల్
➥ హ్యూమన్ రిసోర్సెస్
➥ ఐటీ ప్రోగ్రామింగ్
➥ లీగల్
➥ టెస్ట్ కిచెన్
➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్.
అర్హతలు: డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (మెకానికల్, ఎలక్ట్రికల్, టూల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్, ప్రొడక్ట్ డిజైన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్, క్వాలిటీ కంట్రోల్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెన్సార్స్, రోబోటిక్స్). డిగ్రీ ఫ్రెషర్లు కూడ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 21 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: 18 నెలలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు సంవత్సరానికి రూ.9 లక్షలు. కన్ఫర్మేషన్ తర్వాత సంవత్సరానికి రూ.12 లక్షలు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Senior VP Personnel, Hawkins Cookers Limited,
Maker Tower F 101, Cuffe Parade, Mumbai 400 005.
Sales/Marketing Application Form
Technical/ Engineering Application Form
Human Resources Application Form
IT Programmers Application Form
Legal Application Form
Executive Assistants Application Form
ALSO READ:
CRPF: సీఆర్‌పీఎఫ్‌లో 169 కానిస్టేబుల్ పోస్టులు, వీరిక ప్రత్యేకం
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్-సి విభాగంలో కానిస్టేబుల్-జనరల్ డ్యూటీ (Constable-General Duty) నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 169 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైతే నెలకు 55 వేల రూపాయల జీతం
NTPC Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ వపర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) లిమిటెడ్, ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 25న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.55,000 జీతంతోపాటు ఇతర భత్యాలు చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..