Exim Bank Recruitment: ముంబయిలోని ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంకు) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌. ఎంసీఏ, పీజీ, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 28

⏩ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ: 22 పోస్టులు

పోస్టుల కెటాయింపు: యూఆర్- 11, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 05, ఎస్సీ- 03, ఎస్టీ- 01. 

➥ డిజిటల్‌ టెక్నాలజీ: 10

అర్హత: కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడుతో బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌), ఎంసీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

➥ రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌: 05

అర్హత: కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడుతో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎకనామిక్స్)లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

➥ రాజ్‌భాష: 02

అర్హత: కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమాన సీజీపీఏ(గ్రాడ్యుయేషన్) కలిగి ఉండాలి. అండ్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీలో హిందీతో పాటు ఇంగ్లీషు తప్పనిసరి లేదా ఎంపిక చేసిన సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా ఉండాలి.  ➥ లీగల్‌: 05

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ (లా / ఎల్ఎల్‌బీ), ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ కోర్సు, రెగ్యులర్ ఎల్ఎల్‌బీ కలిగి ఉండాలి.

⏩ డిప్యూటీ మేనేజర్‌(గ్రేడ్ / స్కేల్ జూనియర్ మేనేజ్‌మెంట్ I): 05 

పోస్టుల కెటాయింపు: యూఆర్- 04, ఓబీసీ- 01.

➥ లీగల్‌: 04

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ (లా / ఎల్ఎల్‌బీ), ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ కోర్సు, రెగ్యులర్ ఎల్ఎల్‌బీ కలిగి ఉండాలి. 1 సంవత్సరం అనుభవం ఉన్న న్యాయవాదికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

➥ డిప్యూటీ కంప్లైయన్స్ ఆఫీసర్: 01

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఐసీఎస్‌ఐ & రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అసోసియేట్ మెంబర్‌షిప్ (ACS), ఎంబీఏతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

⏩ చీఫ్‌ మేనేజర్‌(గ్రేడ్ / స్కేల్ మిడిల్ మేనేజ్‌మెంట్ III): 01

పోస్టుల కెటాయింపు: యూఆర్- 01. 

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఐసీఎస్‌ఐ & రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అసోసియేట్ మెంబర్‌షిప్ (ACS), ఎంబీఏతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 28.02.2025 నాటికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 31 నుంచి 33 సంవత్సరాలు; ఈడబ్ల్యూఎస్‌/ యూఆర్‌ అభ్యర్థులకు 28 నుంచి 40 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.  

జీత భత్యాలు: నెలకు మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు రూ.65,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.48,480 నుంచి రూ.85,920; చీఫ్‌ మేనేజర్‌కు రూ.85,920 నుంచి 1,05,280.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.03.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.04.2025.

➥ రాత పరీక్ష తేదీ: మే 2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..