DRDO Recruitment: మైసూరులోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో-డిఫెన్స్ టెక్నాలజీస్(DRDO-DIBT) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీజీ, నెట్, గేట్, బీఈ, బీటెక్, ఎంటెక్‌లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు వెలువడిన తేదీ నుంచి 30 రోజులలోపు దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 20న ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 18
* జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు
విభాగాలు: మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బైయోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్.
⏩ మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/ బైయోకెమిస్ట్రీ/ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ఫుడ్ సైన్స్/ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్: 15 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం /ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే నెట్/గేట్ కలిగి ఉండాలి. లేదా ఫస్ట్ డివిజన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ప్రొఫెషనల్ కోర్సు (ఎం.టెక్)) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 20.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
⏩ పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/మెకానికల్ ఇంజినీరింగ్: 03 పోస్టులు
అర్హత: ఫస్ట్ డివిజన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ (ప్రొఫెషనల్ కోర్సు (బీఈ/బీటెక్) ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే నెట్/గేట్ స్కోరు కలిగి ఉండాలి. లేదా ఫస్ట్ డివిజన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ప్రొఫెషనల్ కోర్సు (ఎం.టెక్)) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 20.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
➥ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత టెస్టిమోనియల్స్/డాక్యుమెంట్ల కాపీలతో పాటు సంబంధిత చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కొరియర్ ద్వారా పంపిన దరఖాస్తులు స్వీకరించబడవు.
➥ అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు కాస్ట్, వయస్సు, విద్యార్హత/నెట్/గేట్ మరియు ఎన్‌ఓసీ(NOC) (వర్తించే చోట) రుజువు కోసం వారి తగిన డాక్యుమెంట్‌లను సమర్పించాలి, లేని పక్షంలో దరఖాస్తు తిరస్కరించబడుతుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మైసూరులోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో-డిఫెన్స్ టెక్నాలజీస్‌లో రాత పరీక్ష/ఇంటర్వ్యూకు పిలుస్తారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు సమాచారం ఈ-మెయిల్/స్పీడ్ పోస్ట్ ద్వారా పంపబడుతుంది.
ఇంటర్వ్యూ సమయంలో..
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు టెస్టిమోనియల్స్‌ను తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి. అదనంగా, అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో దరఖాస్తు ఫారమ్ అండ్ ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డ్ (ఆధార్, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి)తో పాటు అన్ని పత్రాల ఫోటోకాపీ సెట్‌ను తీసుకురావాలి.
జీతం: నెలకు రూ.37,000.
కాల వ్యవధి: ఫెలోషిప్ పదవీకాలం ప్రారంభంలో రెండు సంవత్సరాల పాటు ఉంటుంది. పనితీరు ఆధారంగా.. అవసరమైతే దీనిని 3వ & 4వ సంవత్సరానికి పొడిగించవచ్చు.
వేదిక:
Defence Institute of BioDefence Technologies (DIBT),
Siddhartha Nagar, Mysuru-570011.
ఇంటర్వ్యూ తేదీ: 20.03.2025.
Notifiction and Application Form