DRDO-GTRE Recruitment of Apprentice Trainees: బెంగళూరులోని డీఆర్‌డీవో- గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్(DRDO-GTRE) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీటెక్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 08 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 150
విభాగాలు: మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఎరోనాటికల్, ఎరోస్పేస్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్స్, ఎలక్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్, టెలికమ్, సీఎస్, ఐటీ, మెటలర్జీ, మెటీరియల్ సైన్స్, సివిల్.
⏩ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్- ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్/తత్సమానం): 75 పోస్టులు
➥ మెకానికల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్: 30 పోస్టులు
➥ ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్: 15 పోస్టులు
➥ ఎలక్ట్రికల్స్&ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/టెలికాం ఇంజినీరింగ్: 10 పోస్టులు
➥ కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ & టెక్నాలజీ ఇంజినీరింగ్: 15 పోస్టులు
➥ మెటలర్జీ/మెటీరియల్ సైన్స్: 04 పోస్టులు
➥ సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమానం: 01 పోస్టు
⏩ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్- నాన్ ఇంజనీరింగ్ (బీకాం/ బీఎస్సీ / బీఏ / బీసీఏ, బీబీఏ): 30 పోస్టులు
➥ బీకామ్: 10 పోస్టులు
➥ బీఎస్సీ (కెమిస్ట్రీ / ఫిజిక్స్ / మ్యాథ్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ మొదలైనవి): 05 పోస్టులు
➥ బీఏ (ఫైనాన్స్/ బ్యాంకింగ్ మొదలైనవి): 05 పోస్టులు
➥ బీసీఏ: 05 పోస్టులు
➥ బీబీఏ: 05 పోస్టులు
⏩ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్: 20 పోస్టులు
➥ మెకానికల్/ప్రొడక్షన్/టూల్ & డై డిజైన్: 10 పోస్టులు
➥ ఎలక్ట్రికల్స్&ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్: 07 పోస్టులు
➥ కంప్యూటర్ సైన్స్ /ఇంజినీరింగ్./కంప్యూటర్ నెట్‌వర్కింగ్: 03 పోస్టులు
⏩ ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీస్: 25 పోస్టులు
➥ మెషినిస్ట్: 03 పోస్టులు
➥ ఫిట్టర్: 04 పోస్టులు
➥ టర్నర్: 03 పోస్టులు
➥ ఎలక్ట్రీషియన్: 03 పోస్టులు
➥ వెల్డర్: 02 పోస్టులు
➥ షీట్ మెటల్ వర్కర్: 02 పోస్టులు
➥ కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA): 08 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీకాం/ బీఎస్సీ / బీఏ / బీసీఏ, బీబీఏ, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 08.05.2025 నాటికి 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000, ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.7000.
ఈమెయిల్: hrd.gtre@gov.in
ఇంటర్వ్యూ సమయంలో కావాల్పిన డాక్యుమెంట్‌లు..
➥ 10వ తరగతి మార్కుషీట్ అండ్ సర్టిఫికేట్. ,
➥ బీఈ/బీటెక్/డిప్లొమా/ఐటిఐ/డిగ్రీ(బీకాం/ బీఎస్సీ / బీఏ / బీసీఏ, బీబీఏ)అన్ని సెమిస్టర్ల మార్కుల షీట్లు /సంవత్సరాల వారీగా
➥ డిగ్రీ / ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్
➥ కాస్ట్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
➥ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ (వర్తిస్తే)
➥ భారత ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు ప్రాధాన్యంగా)
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
➥ రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
➥ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ (డిస్ట్రిక్ట్ అథారిటీ)
➥ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.04.2025.
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.05.2025.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Director,Gas Turbine Research EstablishmentDRDO, Ministry of DefencePost Box No. 9302, CV Raman NagarBENGALURU - 560 093.