విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులకు రూ.750. ఇతరులకు రూ.1500 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫిభ్రవరి 1 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 20
పోస్టుల కేటాయింపు: ఓసీ: 09, బీసీ- ఎ: 02, బీసీ- బి: 01, బీసీ- డి: 02, బీసీ- ఇ: 02, ఈడబ్ల్యూఎస్: 02, ఎస్సీ: 03.
* జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులకు రూ.750. ఇతరులకు రూ.1500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు రూ.25,220-రూ.80,910.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 12.01.2024.
ఫీజు చెల్లింపుకు చివరితేదీ: 31.01.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 01.02.2024.
ALSO READ:
ఏఐఐఏలో 140 స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులు
AIIA Recruitment: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, స్టాఫ్ సర్జన్, జూనియర్ స్టాఫ్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి 12వ తరగతి, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్, బీఎస్సీ, డిప్లొమా కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్, 813 మందికి ఉద్యోగాలు
Telangana RTC Compassionate Appointments: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకోనుంది. ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులు ఇవ్వాలని మంత్రి పొన్నం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలోని 11 రీజియన్ల నుంచి మొత్తం 813 కండక్టర్ పోస్టులను కారుణ్య నియామకాల కింద ప్రభుత్వం భర్తీ చేయనున్నది. పెండింగ్‌లో ఉన్న నియామకాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..