ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రజారోగ్య & కుటుంబ సంక్షేమ సంచాలకులు 461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచారు. జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ (లేదా) బీఎస్సీ(నర్సింగ్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఫ్‌లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 5 వరకు దరఖాస్తులు సమర్పణకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
* స్టాఫ్ నర్స్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 461
అర్హత: జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ (లేదా) బీఎస్సీ(నర్సింగ్) అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 42 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, సంబంధిత చిరునామాలో నిర్ణీత గడువులోగా సమర్పించాలి.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో 75 శాతం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో మార్కులకు కేటాయించారు. 10 శాతం విద్యార్హతలకు కేటాయించారు. ఇక మిగతా 15 శాతం అభ్యర్థుల పని అనుభవానికి కేటాయించారు.
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామాలు:
The Regional Director Medical and Health Services, Opp. Bullaiah College, Resapuvanipalem, Visakhapatnam. |
The Regional Director Medical and Health Services, Aswini Hospital Backside, Old Itukulabatti Road, Guntur. |
The Regional Director Medical and Health Services, District Headquarters Hospital Compound, Rajamahendravaram. |
The Regional Director Medical and Health Services, Old RIMS, Kadapa. |
ముఖ్యమైన తేదీలు...
➥దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.11.2022.
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 05.12.2022.
Also Read:
ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కరెన్సీ నోట్ ప్రెస్‌లో 125 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
నాసిక్ (మహారాష్ట్ర)లోని కరెన్సీ నోట్ ప్రెస్ సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్), బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, మెరిట్‌లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 26 నుంచి డిసెంబరు 16 వరకు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ జనవరి/ఫిబ్రవరి 2023 లేదా అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్ష తేదీలను పొడిగించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.