ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్ అర్బన్ క్లినిక్/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదోతరగతి, ఎంబీబీఎస్, డీఫార్మసీ/ బీఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత దరఖాస్తులను నింపి సంబధిత ధృవ పత్రాలను జతపరిచి వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, జీజీహెచ్ కాంపౌండ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాలో అందచేయాలి.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 18
1) మెడికల్ ఆఫీసర్లు/ సీఏఎస్: 07 పోస్టులు
2) ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 02 పోస్టులు
3) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 04 పోస్టులు
4) లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్: 05 పోస్టులు


అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఎంబీబీఎస్, డీఫార్మసీ/ బీఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.300.


ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: నిర్ణిత దరఖాస్తులను నింపి సంబధిత ధృవ పత్రాలను జతపరిచి వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, జీజీహెచ్ కాంపౌండ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాలో అందచేయాలి.


ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 26.11.2022.
ప్రాథమిక మెరిట్ జాబితా వెల్లడి, అభ్యంతరాల స్వీకరణ తేది: 28.11.2022.
తుది మెరిట్ జాబితా వెల్లడి: 05.12.2022.
నియామక ఉత్తర్వుల జారీ: 07.12.2022.


Notification 


Website 


Also Read:


ఏపీలో 1,010 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్! పోస్టులు ఇవే!
ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1010 వెల్ఫేర్ ఆఫీసర్స్, కేర్ టేకర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్ల పై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ నవంబరు 18న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు మంచి సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని సీఎం సూచించారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఉద్యోగాలు - పూర్తి వివరాలు ఇవీ!
హైదరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు పోస్టులకు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(హ్యూమానిటి/సోషల్ సైన్సెస్/సోషియాలజి/సైకాలజీ/సోషల్ వర్క్), కంప్యూటర్ అప్లికేషన్స్, డేటాఎంట్రీ ఆపరేషన్స్ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత ధ్రువపత్రాలు జతపరిచి నోటిఫికేషన్ వెలువడిన 10 రోజులలోగా సంబంధిత చిరునామాలో అందచేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...