భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్‌లో ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15000 ఇంటర్న్‌షిప్‌గా ఇస్తారు. ఇంటర్నిషిప్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు.
వివరాలు:
* TEC ఇంటర్న్‌షిప్ స్కీమ్ - ఇంటర్న్
- ఖాళీల సంఖ్య: 25
విభాగాలు: ఫిక్స్‌డ్ యాక్సెస్, ఫ్యూచర్ నెట్‌వర్క్స్, ఐటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్, మొబైల్ టెక్నాలజీస్, నెక్ట్స్ జనరేషన్ స్విచ్చింగ్, రేడియ, స్మార్ట్ నెట్‌వర్క్స్, స్టాండర్డైజేషన్, ట్రాన్స్‌మిషన్, టెలికామ్ సర్టిఫికేషన్, టెలికామ్ సెక్యూరిటీ, మ్యూచువల్ రికాగ్నైషన్ అగ్రిమెంట్స్, RTEC-ఈస్ట్ (కోల్‌కతా), RTEC-నార్త్ (న్యూఢిల్లీ), RTEC-సౌత్ (బెంగళూరు), RTEC-వెస్ట్ (ముంబయి).
వ్యవధి: 6 నెలలు. అవసరానికి అనుగుణంగా మరో 6 నెలలు పొడిగించే అవకాశం ఉంటుుంది.
అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ/ పీజీ (ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్స్/ టెలికమ్యూనికేషన్/ రేడియో/ఐటీ/ కంప్యూటర్స్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, తుది ఎంపికజాబితా ప్రకటిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.09.2022.
* దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31.10.2022.
* ఎంపికజాబితా వెల్లడి: 30.11.2022.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Office of Telecommunication Engineering Centre (TEC),
Khurshid Lal Bhawan, Janpath,
New Delhi - 110001
Also Read:
TSPSC AE Jobs: తెలంగాణలో 837 ఇంజినీరింగ్ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 12న నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Recruitment: 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులను భర్తీచేయనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Jobs: తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..