CTET-2024 దరఖాస్తుకు నవంబరు 23తో ముగియనున్న గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి

CTET- జనవరి 2024 సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 23తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు నవంబరు 23న రాత్రి 12 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

Continues below advertisement

Central Teacher Eligibility Test CTET : సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (CTET)- జనవరి 2024 సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 23తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు నవంబరు 23న రాత్రి 12 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సీటెట్ దరఖాస్తు (CTET Application) ప్రక్రియ నవంబరు 3న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. 

Continues below advertisement

సీటెట్-2024 జనవరి నోటిఫికేషన్‌‌ను 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)' నవంబరు 3న విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది రెండుసార్లు (జనవరి, జులై) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. సీటెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 21న నిర్వహించనున్నారు.

తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌లలో మాత్రమే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో సీబీఎస్‌ఈ పేర్కొంది. గతంలో 8 పరీక్షా కేంద్రాలు ఉంటే దాన్ని ఆరుకు కుదించారు. మళ్లిప్పుడు ఆరు నుంచి రెండుకు కుదించారు. దీంతో రాష్ట్రంలోని అభ్యర్థులకు కొంత ఇబ్బంది కల్గనుంది. ఇది వరకు దరఖాస్తులు భారీగా రావడం, సెంటర్లు సరిపోకపోవడంతో ఏపీలోని విజయవాడలో పరీక్షాకేంద్రాలను కేటాయించారు. అయినా సీబీఎస్‌ఈ తీరు మార్చుకోకపోవడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు..

✪ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జనవరి - 2024

✦ ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి) (పేపర్-1)

అర్హత: 
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

✦ ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి) (పేపర్ 2)


అర్హత:
 గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

దరఖాస్తు ఫీజు: 
జనరల్/ఓబీసీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.500; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాలి.

ఎంపిక విధానం:
 రాతపరీక్ష ద్వారా.

పరీక్ష విధానం..


✦ పేపర్-1:
 ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు.

✦ పేపర్-2:
 ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు.

ముఖ్యమైన తేదీలు...

➥ సీటెట్ డిసెంబరు 2022 నోటిఫికేషన్ వెల్లడి: 03.11.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.11.2023. (11:59PM)

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.11.2023. (11:59PM) 

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 23.11.2023.

➥ పరీక్ష తేదీ: 21.01.2024.

పరీక్ష సమయం: 

పేపర్-2 - ఉదయం 9.30 గం. - మధ్యాహ్నం 12 గంటల వరకు.

పేపర్-1 - మధ్యాహ్నం 2.00 గం. - సాయంత్రం 4 గంటల వరకు.

CTET January 2024 Notification

Online Application

Website

                                   

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement