CSIR- CCMB Jobs: హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, ఎంబీబీఎస్‌, ఎంబీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 24


* టెక్నికల్ స్టాఫ్ పోస్టులు


⏩ టెక్నికల్ అసిస్టెంట్: 18


విభాగాల వారీగా ఖాళీలు..


➥ ప్రోటీమిక్స్- 02


అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయో-టెక్నాలజీ) లేదా తత్సమానం & గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుండి సంబంధిత విభాగంలో 01 ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.


➥ సివిల్- 03


అర్హత: కనీసం 60% మార్కులతో కనీసం 03 సంవత్సరాల ఫుల్‌టైం సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతో పాటు సంబంధిత ప్రాంతం/ఫీల్డ్‌లో 02


సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


➥ క్యాంటీన్- 02


అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(హాస్పిటాలిటీ &హోటల్ అడ్మినిస్ట్రేషన్/ హోటల్ మేనేజ్‌మెంట్/ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ/ క్యాటరింగ్ సైన్స్ & హోటల్ మేనేజ్‌మెంట్) లేదా తత్సమానం & గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుండి సంబంధిత విభాగంలో 01 ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. 


➥ ఇన్‌స్ట్రుమెంటేషన్- 02


అర్హత: కనీసం 60% మార్కులతో కనీసం 03 సంవత్సరాల ఫుల్‌టైం ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతో పాటు సంబంధిత ప్రాంతం/ఫీల్డ్‌లో 02 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

➥ టిష్యూ కల్చర్- 01


అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(బయో-టెక్నాలజీ/బయో కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/జువాలజీ) లేదా తత్సమానం & గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుండి సంబంధిత విభాగంలో 01 ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. 


➥ జీబ్రాఫిష్- 01


అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(జువాలజీ/బయో-టెక్నాలజీ) లేదా తత్సమానం & గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుండి సంబంధిత విభాగంలో 01 ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. 


➥ యానిమల్ హౌస్- 01


అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(లైఫ్ సైన్సెస్/ బయోటెక్నాలజీ/ జువాలజీ/మైక్రోబయాలజీ) లేదా తత్సమానం & గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుండి సంబంధిత విభాగంలో 01 ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. 


➥ ఫైన్ బయోకెమికల్స్- 01


అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ/ కెమిస్ట్రీ) లేదా తత్సమానం & గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుండి సంబంధిత విభాగంలో 01 ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. 


➥ ఫాక్స్- 01


అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(బయో-టెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ/ఫిజిక్స్/కెమిస్ట్రీ) లేదా తత్సమానం & గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుండి సంబంధిత విభాగంలో 01 ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. 


➥ లాకోన్స్- 01


అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(ఫారెస్ట్రీ/జువాలజీ/బోటనీ) లేదా తత్సమానం & గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుండి సంబంధిత విభాగంలో 01 ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. 


➥ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్- 01


అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(బయో-టెక్నాలజీ) లేదా తత్సమానం & గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుండి సంబంధిత విభాగంలో 01 ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. 


➥ ఏసీ & రెఫ్రిజిరేషన్- 01


అర్హత: కనీసం 60% మార్కులతో కనీసం 03 సంవత్సరాల ఫుల్‌టైం మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతో పాటు సంబంధిత ప్రాంతం/ఫీల్డ్‌లో 02 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


➥ ఎలక్ట్రికల్- 01


అర్హత: కనీసం 60% మార్కులతో కనీసం 03 సంవత్సరాల ఫుల్‌టైం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతో పాటు సంబంధిత ప్రాంతం/ఫీల్డ్‌లో 02 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. 


జీతం: రూ.66,498.


⏩ టెక్నికల్ ఆఫీసర్: 05


విభాగాల వారీగా ఖాళీలు..


➥ ట్రాన్స్ జెనిక్ నాకౌట్ ఫెసిలిటీ- 01


అర్హత: కనీసం 55% మార్కులతో బీఈ/బీటెక్(బయోటెక్నాలజీ) లేదా తత్సమానం లేదా ఎంఎస్సీ(బయోటెక్నాలజీ ఎంబ్రియాలజీ/యానిమల్ బయోటెక్నాలజీ/జువాలజీ) ఉత్తీర్ణత ఉండాలి.


➥ యానిమల్ హౌస్ ఫెసిలిటీ- 01


అర్హత: కనీసం 55% మార్కులతో బీఈ/బీటెక్(బయోటెక్నాలజీ) లేదా తత్సమానం లేదా ఎంఎస్సీ(బయోటెక్నాలజీ/జువాలజీ/లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత ఉండాలి.


➥ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్- 01


అర్హత: కనీసం 55% మార్కులతో బీఈ/బీటెక్(బయోఇన్ఫర్మేటిక్స్) లేదా తత్సమానం లేదా ఎంఎస్సీ(బయోఇన్ఫర్మేటిక్స్) ఉత్తీర్ణత ఉండాలి.


➥ లేబొరేటరీ టెక్నికల్ సర్వీసెస్- 01


అర్హత: కనీసం 55% మార్కులతో ఎంబీఏ(హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్) లేదా తత్సమానం ఉత్తీర్ణత ఉండాలి.


➥ ప్లాంట్ బయాలజీ- 01


అర్హత: కనీసం 55% మార్కులతో బీఈ/బీటెక్(అగ్రికల్చర్/బయోటెక్నాలజీ) లేదా తత్సమానం లేదా ఎంఎస్సీ(అగ్రికల్చర్/బయోటెక్నాలజీ/లైఫ్ సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. 


జీతం: రూ.82,933.


⏩ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్/ మెడికల్ ఆఫీసర్: 01


అర్హత: కనీసం 55% మార్కులతో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉండాలి. జనరల్ మెడిసిన్/ పీడియాట్రిక్స్‌లో ఎండీ/డీఎన్‌బీ. కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. 


జీతం: రూ.1,23,946.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


ఎంపిక విధానం: టెక్నికల్ అసిస్టెంట్/ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్/ ఎంవోకు ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2024.


Notification


Website


ALSO READ:


➥ ఎస్‌బీఐ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష షెడ్యూలు విడుదల, ఎప్పుడంటే?


➥ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత శిక్షణ 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...