ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30,625 మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌ స్ట్రక్షన్‌(న్యాక్‌) నిర్ణయించింది. సెప్టెంబర్‌ 24న నిర్వహించిన న్యాక్ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు న్యాక్‌ తెలిపింది. జిల్లాల్లో నిర్మించే కేంద్రాలు నిరుద్యోగ యువతకు నిర్మాణం, ఐటీ, సేవల రంగాల్లో శిక్షణ తీసుకోవడానికి కేంద్ర శిక్షణా కేంద్రాలుగా మారేవిధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.



తెలంగాణ నుంచి మధ్యప్రాచ్య దేశాలకు పెద్దసంఖ్యలో నిరుద్యోగులు వలస వెళ్తున్న నేపథ్యంలో.. 9 జిల్లాల్లో దశలవారీగా శిక్షణ కేంద్రాలను నిర్మించనున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే నియామకాల్లో ఎంపికైన ఇంజినీర్లకు 30 రోజులపాటు వృత్తిపరమైన శిక్షణ ఇవ్వనున్నారు. దళితబంధు పథకం ద్వారా జేసీబీలు పొందినవారికి వాటి నిర్వహణపై శిక్షణ ఉంటుంది. దళితబంధు లబ్ధిదారులందరికీ ఎక్విప్‌మెంట్‌ ఆపరేటర్‌ శిక్షణ ఇవ్వాలని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (న్యాక్‌) పాలకవర్గం నిర్ణయించింది. జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున న్యాక్‌ శిక్షణ కేంద్రాలను నిర్మించాలని తీర్మానించింది.



ఉద్యోగులకు వరాలు...
వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యాక్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. వీరికి రెండు దఫాలుగా వేతనాన్ని 30 శాతం పెంచనున్నారు. 2021 జనవరి నుంచి 20 శాతం, ఈ ఏడాది ఆగస్టు నుంచి 10 శాతం వేతనం పెంపును సమావేశం ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.



తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ఇలా..



  1. 2022-23లో 30,625 మానవ వనరులకు శిక్షణ ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం.


  2. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ విభాగాల నుంచి 20 శాతం మంది వరింగ్‌ ఇంజినీర్లకు స్వల్పకాలిక శిక్షణలు.


  3. 2022-23 సంవత్సరంలో టీఎస్‌పీఎస్సీ ద్వారా రిక్రూట్‌ అవుతున్న ఇంజినీర్ల (టెక్నికల్‌, పర్సనల్‌)కు 30 రోజుల ఇండక్షన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం.

  4. దళితబంధు లబ్ధిదారులందరికీ ఎక్విప్‌మెంట్‌ ఆపరేటర్‌ శిక్షణ.

  5. ఉమ్మడి జిల్లాల్లో నిర్మించే న్యాక్‌ శిక్షణ కేంద్రాల్లో ఉపాధి కోసం మధ్యప్రాశ్చ్య దేశాలకు వెళ్లే జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.


  6. 2021-22 సంవత్సరానికి ఆడిట్‌ చేసిన ఆర్థిక నివేదికల ఆమోదం.


  7. 11 జిల్లాల శిక్షణాకేంద్రాలకు రూ.1.32 కోట్లు మంజూరు.


  8. తాన్లా ప్లాట్‌ ఫారమ్‌ లిమిటెడ్‌తో కలిసి 100 మంది నిరుద్యోగ యువతకు పైలట్‌ ప్రాతిపదికన నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమానికి అనుమతి
    న్యాక్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యాక్‌ కాంట్రాక్ట్‌ , ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 30 శాతం పెంపుదల రెండు విడతలుగా మంజూరు.


 


ఇవి కూడా చదవండి..


SSC CGL Notification:  కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి,  గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే  'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022'  నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.  ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  మూడంచెల  (టైర్-1,టైర్-2,  టైర్-3)  పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్ , దరఖాస్తు వివరాల  కోసం  క్లిక్ చేయండి...


 


UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా!
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..