అరువంకాడులోని కార్డైట్ ఫ్యాక్టరీ ఒప్పంద ప్రాతిపదికన టెన్యూర్ బేస్డ్ కెమికల్ ప్రాసెస్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 126 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదవతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీటీవీటీ జారీ చేసిన సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులను ఎన్‌సీటీవీటీ పరీక్ష & ట్రేడ్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్‌లో సాధించిన మార్కులు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో మొదటి ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 126


రిజర్వ్ కేటగిరీ: యూఆర్: 53, ఓబీసీ: 34, ఎస్సీ: 18, ఎస్టీ: 09, ఈడబ్ల్యూఎస్: 12, ఎక్స్-సర్వీస్‌మెన్:12


* టెన్యూర్ బేస్డ్ కెమికల్ ప్రాసెస్ వర్కర్(సీపీడబ్ల్యూ) పోస్టులు


అర్హత: పదవతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ వొకేషనల్ ట్రేడ్స్ - NCTVT(ప్రస్తుతం NCVT (నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్)) జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.


వయోపరిమితి: 01.10.2023 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మిలిటరీ సర్వీస్ వ్యవధి + 03 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


స్కిల్ లెవెల్: స్కిల్ల్డ్.


జాబ్ స్పెసిఫికేషన్: కోర్ టెక్నికల్ ఏరియా అఫ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్.


దరఖాస్తు ఫీజు: లేదు.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసిన తర్వాత బ్లాక్ లెటర్‌లలో మాత్రమే దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. విద్యార్హతల స్వీయ ధృవీకరణ కాపీలు, వయస్సు రుజువు కోసం సర్టిఫికేట్, సంస్థల నుండి అనుభవ ధృవీకరణ పత్రం మొదలైనవాటిని దరఖాస్తుతో పాటు జతచేయాలి. ఎన్వలప్‌పై తప్పనిసరిగా “TENURE BASED CPW PERSONNEL ON CONTRACT BASIS”. పోస్ట్ కోసం దరఖాస్తు" అని స్పష్టంగా వ్రాయాలి. 


దరఖాస్తు పంపాల్సిన చిరునామా: 
The General Manager,
Cordite Factory,
Aruvankadu, The Nilgiris District.
Tamilnadu Pin -643 202. 


ఎంపిక విధానం: 


⏩ అభ్యర్థులను ఎన్‌సీటీవీటీ పరీక్ష & ట్రేడ్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్‌లో సాధించిన మార్కులు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రేడ్ పరీక్ష కోసం అభ్యర్థులను పిలవడానికి కట్ ఆఫ్ శాతాన్ని ఎన్‌సీటీవీటీలో పొందిన మొత్తం మార్కుల ఆధారంగా ఫ్యాక్టరీ నిర్ణయిస్తుంది. 


⏩ఎన్‌సీటీవీటీ పరీక్ష & ట్రేడ్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్‌లో పొందిన కంబైన్డ్ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. ఎన్‌సీటీవీటీ పరీక్ష & ట్రేడ్ టెస్ట్/ప్రాక్టికల్ పరీక్షలో మార్కుల వెయిటేజీ వరుసగా 80%, 20% ఉంటుంది. 


⏩ ఎన్‌సీటీవీటీ పరీక్ష &ట్రేడ్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రకారం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలిచే అభ్యర్థుల సంఖ్యను విభాగం/కేటగిరీ వారీగా నోటిఫై చేయబడిన పోస్టుల సంఖ్యకు పరిమితం చేయబడుతుంది. 


⏩ అవసరమైన పత్రాలు/టెస్టిమోనియల్స్ అందుబాటులో లేనందున, పత్రాల ధృవీకరణ ప్రక్రియలో అభ్యర్థులు తిరస్కరించబడిన సందర్భంలో, ప్రకటన చేసిన ప్రమాణాలకు సంబంధించిన వయస్సు, అర్హత, అనుభవం మొదలైనవి, మెరిట్ ప్రకారం విభాగం/కేటగిరీ వారీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అదనపు అభ్యర్థులను పిలుస్తారు. పిలవబడే అదనపు అభ్యర్థుల సంఖ్య డాక్యుమెంట్ వెరిఫికేషన్ తిరస్కరించబడిన అభ్యర్థుల సంఖ్యకు పరిమితం చేయబడుతుంది.


బేసిక్ పే: రూ. 19,900 +DA


ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో మొదటి ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజులు.


Notification 


Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..