CMPFO Recruitment: కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(సీఎంపీఎఫ్‌ఓ) ఖాళీగా ఉన్న గ్రూప్-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 115 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం అంతటా వివిధ ప్రదేశాలలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 115


* గ్రూప్- సీ పోస్టులు


⏩ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 11


పోస్టుల కేటాయింపు: యూఆర్- 07 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు, ఎస్సీ- 01 పోస్టు, ఎస్టీ- 0 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 01 పోస్టు.


అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి/ఇంటర్మీడియట్ లేదా తత్సమానం, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు షార్ట్ హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు, టైప్‌రైటింగ్‌లో నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి.


వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; దివ్యాంగులకు(జనరల్- 10, ఓబీసీ- 13, ఎస్సీ/ఎస్టీ- 15) సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.


⏩ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్: 104


పోస్టుల కేటాయింపు: యూఆర్- 39 పోస్టులు, ఓబీసీ- 28 పోస్టులు, ఎస్సీ- 18  పోస్టులు, ఎస్టీ- 09 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 10 పోస్టులు.


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ వేగం ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; దివ్యాంగులకు(జనరల్- 10, ఓబీసీ- 13, ఎస్సీ/ఎస్టీ- 15) సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.. 


జీతం: నెలకు రూ.28,000.


పోస్టింగ్ స్థానాలు: ధన్‌బాద్ (జార్ఖండ్), రాంచీ (జార్ఖండ్), డియోఘర్ (జార్ఖండ్), న్యూఢిల్లీ, కోల్‌కతా, అసన్సోల్ (పశ్చిమ బెంగాల్), జబల్‌పూర్ (మధ్యప్రదేశ్), బలాస్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), చింద్వారా (మధ్యప్రదేశ్), సింగ్రౌలి (మధ్యప్రదేశ్), కొత్తగూడెం ( ఆంధ్రప్రదేశ్), గోదావరిఖని (ఆంధ్రప్రదేశ్), సంబల్పూర్ (ఒడిశా), తాల్చేర్ (ఒడిశా) మరియు మర్గేరియాటా (అస్సాం). అభ్యర్థులు తమకు నచ్చిన మూడు స్థానాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది, కానీ తుది పోస్టింగ్ సీఎంపీఎఫ్‌ఓ అధికారుల అభీష్టానుసారం ఉంటుంది.


దరఖాస్తు చేయడం ఎలా..


➥ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్దతిలోనూ దరఖాస్తులు అంగీకరించబడవు.


➥ అధికారిక వెబ్‌సైట్‌ https://starrating.coal.gov.in/cmpfo/ లో లాగిన్ అవ్వాలి.


➥ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం "రిజిస్టర్" పై క్లిక్ చేయండి.


➥ రిజిస్ట్రేషన్ తర్వాత, వ్యక్తిగత వివరాలు మరియు విద్యా వివరాలను నింపాలి.


➥ తరువాత, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.


➥ ఫారమ్ పూర్తి చేసిన తర్వాత, అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసి, మీ దరఖాస్తును సమర్పించండి.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.02.2025.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..