సీఐఎస్‌ఎఫ్‌లో కానిసేబుల్ (ఫైర్) పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఫలితాలను సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)/ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME), రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి పేలెవల్-3 కింద నెలకు రూ.21,700 - రూ.69,100 జీతంగా చెల్లిస్తారు.
కానిస్టేబుల్(ఫైర్‌మ్యాన్) ఫలితాలు ఇలా చూసుకోండి..
Step 1: ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.-www.cisfrectt.cisf.gov.in.
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే "Written Examination Result of Constable (Fire)-2021 has been uploaded on www.cisfrectt.cisf.gov.in." లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: క్లిక్ చేయగానే పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులోని వివరాలు చూసుకోవాలి.
Step 4: అందులో పేర్కొన్న ప్రకారం అభ్యర్థులు లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. అక్కడ హోంపేజీలో కనిపించే "Written Result(Constable/Fire-2021)" లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 5: క్లిక్ చేయగానే కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ వివరాల్లో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదచేసి 'Submit' చేయాలి.
Step 6: సీఐఎస్‌ఎఫ్ ఫైర్‌మ్యాన్ 2023 ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
Step 7: ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1149 కానిస్టేబుల్/ఫైర్ పోస్టుల భర్తీకి గతేడాది (2022) జనవరిలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 29 నుంచి మార్చి 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మార్చి 7 వరకు ఫీజు స్వీకరించారు. అభ్యర్థులకు ఆగస్టు 16 నుంచి అక్టోబరు 10 వరకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో నిర్వహించే రాతపరీక్ష హాల్‌టికెట్లను 2023, సెప్టెంబరు 14న సీఐఎస్‌ఎఫ్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబరు 26న రాతపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని సెప్టెంబరు 29న విడుదల చేసింది. అక్టోబరు మొదటివారంలో ఫలితాలను వెల్లడించనున్నారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తాజాగా ఫలితాలను వెల్లడించింది.
కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 1149 ఖాళీలను భర్తీచేయనున్నారు. వీటిలో జనరల్ విభాగానికి 489 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ విభాగానికి 113 పోస్టులు, ఓబీసీ విభాగానికి 249 పోస్టులు, ఎస్సీలకు 161 పోస్టులు, ఎస్టీలకు 137 పోస్టులు కేటాయించారు. రాష్ట్రాలవారిగా ఈ ఉద్యోగాలను విభజించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 109 మందిని తీసుకోనున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 79, తెలంగాణ నుంచి ౩౦ మందిని సెలెక్ట్ చేయనున్నారు. ఎక్కువ సంఖ్యలో బిహార్ నుంచి 123 మందిని తీసుకోనున్నారు.
ALSO READ:
➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులు, ఎంపికైతే రూ.1.6 లక్షల వరకు జీతం
➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ (లా) పోస్టులు, వివరాలు ఇలా
➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు