సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా నియామకాలు చేపడతారు.


పోస్టుల వివరాలు..


* మొత్తం ఖాళీల సంఖ్య: 540


1) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్): 122 పోస్టులు 


పోస్టుల కేటాయింపు: పురుషులు-94, మహిళలు-10, డిపార్ట్‌మెంటల్-18.


2) హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్): 418 పోస్టులు 


పోస్టుల కేటాయింపు: పురుషులు-319, మహిళలు-36, డిపార్ట్‌మెంటల్-63.



అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.


వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీత భత్యాలు: నెలకు ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29200-92300, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25500-81100. 


ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది).



ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.09.2022.


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.10.2022.



Notification



Website


 


Also Read


DRDO Recruitment: డీఆర్‌డీవోలో 1901 ఖాళీలు, అర్హతలివే!
భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి(ఎస్‌టిఏ- B),టెక్నీషియన్-A (టెక్-A) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read

భారత్ ‌ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 100 ఇంజినీర్‌ పోస్టులు, అర్హతలివే!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ‌ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ‌బెల్‌‌ కేంద్రంలో ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రెండేళ్ల తాత్కాలిక ప్రాదిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, నాబార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ!
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..