TSPSC Certificate verification: తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో షార్ట్ లిస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 29న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 27న ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హార్టికల్చర్ విభాగంలో ఖాళీల భర్తీకీ గతేడాది డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి జనవరి 3 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరిచింది. అభ్యర్థులకు జూన్ 17న రాతపరీక్ష నిర్వహించింది. రాతపరీక్షకు సంబంధించిన పరీక్ష ప్రాథమిక కీని జూన్ 27న ప్రకటించింది. ఆన్సర్ కీపై జూన్ 28 నుంచి జులై 1 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం సెప్టెంబరు తుది కీని విడుదల చేసింది. దీంతో ఫిబ్రవరి 27న ఫలితాలిను వెల్లడించింది. రాతపరీక్ష నుంచి 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఇవి అవసరం..
1) వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.
2) దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ
3) పరీక్ష హాల్‌టికెట్
4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో.
5) 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి.
6) డిగ్రీ లేదా పీజీ ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో.
7) ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).
8) బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.
9) రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులగుతై వయోపరిమితి సడలింపు కోసం సర్వీస్ సర్టిఫికేట్/NCC ఇన్‌స్ట్రక్టర్/ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
10) పీహెచ్ సర్టిఫికేట్ (SADERAM సర్టిఫికేట్).
11) ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి.
12) గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి.
13) నోటిఫికేషన్ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు తీసుకురావాలి.
పోస్టుల వివరాలు..
* హార్టికల్చర్ ఆఫీసర్
ఖాళీల సంఖ్య: 22
అర్హత: డిగ్రీ (హార్టికల్చర్) లేదా హార్టికల్చర్ స్పెషలైజేషన్‌తో ఎంఎస్సీ(అగ్రికల్చర్) విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విభాగాలకు చెందినవారైతే బీఎస్సీ(హార్టికల్చర్) లేని అభ్యర్థులకు బీఎస్సీ (అగ్రికల్చర్) అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (హార్టీకల్చర్-డిగ్రీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నలకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.