సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 787 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 641 పోస్టులు పురుషులకు, మహిళలకు 69 పోస్టులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 77 పోస్టులు కేటాయించారు. పదోతరగతి అర్హత ఉన్న స్త్రీ, పురుషులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
* కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 787
పోస్టు | ఖాళీల సంఖ్య |
కుక్ | 304 |
కోబ్లర్ | 06 |
టైలర్ | 27 |
బార్బర్ | 102 |
వాషర్ మ్యాన్ | 118 |
స్వీపర్ | 199 |
పెయింటర్ | 01 |
మాసన్ | 12 |
ప్లంబర్ | 04 |
మాలి | 03 |
వెల్డర్ | 03 |
* బ్యాక్‌లాగ్ పోస్టులు | |
కోబ్లర్ | 01 |
బార్బర్ | 07 |
మొత్తం ఖాళీలు | 787 |
అర్హత: పదో తరగతి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థులు: ఎత్తు: 170 సెం.మీ., ఛాతీ: 80-85 సెం.మీ. మహిళా అభ్యర్థులు: ఎత్తు: 157 సెం.మీ. ఉండాలి.
వయోపరిమితి: 01.08.2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.1999 - 01.08.2004 మధ్య జన్మించినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్టీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), మెడికల్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు: రూ.21,700-రూ.69,100.
రాత పరీక్ష విధానం: పీఎస్టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు రాత పరీక్షకు ఎంపికవుతారు. పరీక్షకు 2 గంటల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. జనరల్ అవేర్నెస్/ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్, ఎనలిటికల్ ఆప్టిట్యూడ్, హిందీ/ ఇంగ్లిషులో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే సామర్థ్యం తదితరాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్/ హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.
ముఖ్యమైన తేదీలు...
➨ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.11.2022.
➨ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20/12/2022.
Also Read
IOCL: ఐవోసీఎల్‌లో 465 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్), పైప్‌లైన్ డివిజన్ పరిధిలోని ఐదు రీజియన్లలో వివిధ టెక్నికల్/నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 30లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..