CBSE Recruitment: న్యూఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్‌- ఎ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 118 పోస్టులను భర్తీ చేయనున్నారు. మార్చి 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 11న దరఖాస్తుకు చివరితేదీ. ఈ పోస్టులకి సంబంధించిన విద్యార్హతలు, వయో పరిమితి, పరీక్ష ఫీజు, ఎంపిక విధానం, పే స్కేల్, పరీక్ష కేంద్రాలు, సిలబస్, తదితర పూర్తి వివరాలు మార్చి 12న వెలువడ నున్నాయి.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 118


⏩ గ్రూప్‌- ఎ పోస్టులు(పే లెవెల్- 10)..


➥ అసిస్టెంట్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్) : 18 పోస్టులు


➥అసిస్టెంట్ సెక్రటరీ (అకడమిక్స్): 16 పోస్టులు


➥ అసిస్టెంట్ సెక్రటరీ (స్కిల్ ఎడ్యుకేషన్): 08 పోస్టులు


➥ అసిస్టెంట్ సెక్రటరీ (ట్రైనింగ్): 22 పోస్టులు


➥ అకౌంట్స్ ఆఫీసర్: 03 పోస్టులు


⏩ గ్రూప్‌- బి పోస్టులు(పే లెవెల్- 6)..


➥ జూనియర్ ఇంజినీర్: 17 పోస్టులు


➥ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 07 పోస్టులు


⏩ గ్రూప్‌- సి పోస్టులు..


➥ అకౌంటెంట్(పే లెవెల్- 4): 07 పోస్టులు


➥ జూనియర్ అకౌంటెంట్(పే లెవెల్- 2): 20 పోస్టులు


ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2024.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.04.2024.


* విద్యార్హతలు, వయో పరిమితి, పరీక్ష ఫీజు, ఎంపిక విధానం, పే స్కేల్, పరీక్ష కేంద్రాలు, సిలబస్,  తదితర పూర్తి వివరాలు మార్చి 12న వెలువడ నున్నాయి


Notification


Website


ALSO READ:


4187 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?
Delhi Police and Central Armed Police Forces Examination, 2024: ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPF- (బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ) విభాగాల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 5న ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 28 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


ఏపీ ఐటీఐల్లో 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా
APETD Recruitment: ఏపీలోని ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ ఒప్పంద ప్రాతిపదికన పలు ఐటీఐల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బి.ఒకేషనల్‌, డిగ్రీ, డిప్లొమా, ఎన్‌టీసీ, ఎన్‌ఏసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒక్కో పోస్టుకి దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 6న రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష, ప్రాక్టికల్‌ డెమో, పని అనుభవం తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...