Canara Bank Recruitment: బెంగళూరులోని కెనరా బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న కెనరా బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. జనవరి 06న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న వారు  జనవరి 24 తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 60 పోస్టులు


* స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టులు


➥ అప్లిక్లేషన్‌ డెవలపర్స్‌: 07 పోస్టులు

➥ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్‌: 02 పోస్టులు

➥ క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్‌: 02 పోస్టులు

➥ డేటా అనలిస్ట్‌: 01 పోస్టు

➥ డేటా బెస్‌ అడ్మినిస్ట్రేటర్‌: 09 పోస్టులు


➥ డేటా ఇంజినీర్: 02 పోస్టులు


➥ డేటా మైనింగ్‌ ఎక్స్‌పర్ట్: 02 పోస్టులు


➥ డేటా సైంటిస్ట్‌: 02 పోస్టులు


➥ ఎథికల్‌ హ్యాకర్‌ అండ్‌ పెనెట్రేషన్‌ టెస్టర్‌: 01 పోస్టు


➥ ఈటీఎల్‌ స్పెషలిస్ట్‌: 02 పోస్టులు


➥ జీఆర్‌సీ అనలిస్ట్ - ఐటీ గవర్నెన్స్, ఐటీ రిస్క్ అండ్‌ కంప్లయన్స్: 01 పోస్టు


➥ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్: 02 పోస్టులు


➥ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌: 06 పోస్టులు


➥ నెట్‌వర్క్ సెక్యూరిటీ అనలిస్ట్: 01 పోస్టు


➥ ఆఫీసర్‌(ఐటీ) API మేనేజ్‌మెంట్: 03 పోస్టులు


➥ ఆఫీసర్‌(ఐటీ) డేటాబేస్/PL SQL: 02 పోస్టులు


➥ ఆఫీసర్‌(ఐటీ) డిజిటల్ బ్యాంకింగ్ & ఎమర్జింగ్ పేమెంట్స్: 02 పోస్టులు


➥ ఫ్లాట్‌ఫామ్‌ అడ్మినిస్ట్రేటర్‌: 01 పోస్టు


➥ ప్రైవేట్ క్లౌడ్‌ అండ్‌ వీఎంవేర్‌ అడ్మినిస్ట్రేటర్‌: 01 పోస్టు


➥ SOC (సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్) అనలిస్ట్: 02 పోస్టులు


➥ సొల్యూషన్ ఆర్కిటెక్ట్: 01 పోస్టు


➥ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌: 08 పోస్టులు


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ బీఈ/బీటెక్‌, బీసీఏ/ఎంసీఏ/ ఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


పరీక్షా విధానం: మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పై 75 ప్రశ్నలు (75 మార్కులు) అండ్ లాజికల్ రీజనింగ్‌పై 25 ప్రశ్నలు (25 మార్కులు) కేటాయించారు.  


పరీక్ష సమయం:  2 గంటలు.


ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించిన పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్/గాంధీనగర్, బరేలీ, బరోడా, భోపాల్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, మొహాలి, ఢిల్లీ/ఢిల్లీ ఎన్‌సీఆర్, డెహ్రాడూన్, ఎర్నాకులం, పనాజీ, గౌహతి, హైదరాబాద్/సికింద్రాబాద్, జైపూర్, జలంధర్, కోల్‌కతా, లక్నో, ముంబయి/ఎంఎంఆర్/నవీ ముంబయి/థానే, నాగ్‌పూర్, పాట్నా, పూణే, రాయ్‌పూర్ విశాఖపట్నం అండ్ గురుగ్రామ్.


జీతం: సంవత్సరానికి రూ. 18 లక్షల నుంచి రూ. 27 లక్షలు.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.01.2025.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.01.2025.


Notification  


Online Application


Website


ALSO READ: NALCO Non Executive: నేషనల్ అల్యూమినియం కంపెనీలో నాన్ - ఎగ్జిక్యూటివ్ పోస్టులు - పూర్తి వివరాలివే!


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..