కొచ్చీలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు,ఇంటర్వ్యూ,మెడికల్ టెస్ట్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 102
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
విభాగాల వారీగా ఖాళీలు..
1) కెమికల్ ఇంజినీరింగ్: 31
2) సివిల్ ఇంజినీరింగ్: 8
3) కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్: 9
4) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 5
5) సేఫ్టీ ఇంజినీరింగ్/ సేఫ్టీ & ఫైర్ ఇంజినీరింగ్: 10
6) మెకానికల్ ఇంజినీరింగ్: 28
7) ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్.: 9
8) మెటలర్జీ ఇంజనీరింగ్: 2
అర్హత: పోస్టుల వారీగా సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఫుల్‌టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీలో 60%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.
వయోపరిమితి: 01-09-2022 నాటికి అభ్యర్థులు 18 -27 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీతం: రూ.25,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు,ఇంటర్వ్యూ,మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 26.08.2022
NATS పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి చివరి తేదీ: 08.09.2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 13.09.2022
Also Read:
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 207 టీచర్ పోస్టులు
AP DSC Notification: ఏపీలోని ఆదర్శ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా పీజీటీ, టీజీటీ, ఆర్ట్ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 17 వరకు ఫీజు చెల్లించి, ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
SSC - జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ 2022
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 12న నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...