తిరుచిరాపల్లిలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) వివిధ విభాగాల్లో ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పదోతరగతి, ఇంటర్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 24న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 9తో దరఖాస్తు గడువు ముగియనుంది.
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 575
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 95 పోస్టులు
1. మెకానికల్: 52
2. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 15
3. సివిల్ ఇంజినీరింగ్: 08
4. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 06
5. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 02
6 . కెమికల్ ఇంజినీరింగ్: 01
7. అకౌంటెంట్: 04
8. అసిస్టెంట్- హెచ్ఆర్: 03
9. బీఎస్సీ నర్సింగ్: 02
10. బీఫార్మసీ: 02
టెక్నీషియన్ అప్రెంటిస్: 90 పోస్టులు
11. మెకానికల్: 52
12. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 15
13. సివిల్ ఇంజినీరింగ్: 10
14. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 06
15. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 06
16. ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్: 01
ట్రేడ్ అప్రెంటిస్: 390 పోస్టులు
17. ఫిట్టర్: 186
18. వెల్డర్: 120
19. ఎలక్ట్రీషియన్: 34
20. టర్నర్: 14
21. మెషినిస్ట్: 14
22. మెకానిక్ ఆర్ఏసీ: 06
23. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 06
24. కార్పెంటర్: 04
25. మెకానిక్ మోటార్ వెహికల్: 04
26. ప్లంబర్: 02
అర్హత: పదోతరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01.08.2022 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్ష మార్కులు, అసెస్ మెంట్ టెస్ట్, ఫిజికల్ ఫిట్ నెస్ స్టాండర్డ్ తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.08.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.09.2022.
Notification - Graduate Apprentice
Notification - Technician Apprentice
Notification - Trade Apprentice
Also Read:
SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఝార్ఖండ్‌లోని బొకారో స్టీల్ ప్లాంట్‌లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
SSC Stenographer Exam: ఇంటర్ అర్హతతో 'స్టెనోగ్రాఫర్' ఉద్యోగాలు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..