Bhel Recruitment 2026: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద సూపర్వైజర్ ట్రెయినీ, ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 415 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ భర్తీ ప్రక్రియలో ప్రకటన 03/2026 ద్వారా సూపర్వైజర్ ట్రెయినీ 215 పోస్టులు, ప్రకటన సంఖ్య 02/2026 ద్వారా ఇంజినీర్-ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ 200 పోస్టుల నియామకాలు చేపట్టి ఖాళీలు భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇదివరకే ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు BHEL అధికారిక వెబ్‌సైట్‌లో 28 డిసెంబర్ రాత్రి 11:45 గంటల వరకు తమ దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ పేర్కొంది. ఈ రెండు కేటగిరీల పోస్టులకు 27 జనవరి 2027న పరీక్ష నిర్వహించనున్నారు. 

Continues below advertisement

ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే..

BHEL ఈ భర్తీ ప్రక్రియలో 2 రకాల పోస్టులకు నియామకాలు చేపట్టింది. ఇందులో సూపర్వైజర్ ట్రెయినీ 215 పోస్టుల్లో మెకానికల్ 103 పోస్టులు, ఎలక్ట్రికల్ 30 పోస్టులు, సివిల్ 26 పోస్టులు, ఫైనాన్స్ 25 పోస్టులు, హెచ్‌ఆర్ పోస్టులు 20, ఎలక్ట్రానిక్స్  పోస్టులు 11 ఉన్నాయి. అలాగే ఇంజినీర్-ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ 200 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో మెకానికల్ 80 పోస్టులు, ఎలక్ట్రికల్ 30, ఎలక్ట్రానిక్స్ 25, హెచ్‌ఆర్ 20 పోస్టులు, ఫైనాన్స్ 20, సివిల్ 15, ఐటీ- కంప్యూటర్ సైన్స్ 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

Continues below advertisement

BHEL ట్రెయినీ రిక్రూట్‌మెంట్‌కు విద్యార్హతలు 

సూపర్వైజర్ ట్రెయినీకి అర్హతలు

మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ పోస్టుల కోసం సంబంధిత ఇంజినీరింగ్ శాఖలో ఫుల్ టైమ్ డిప్లొమా ఉండాలి. సూపర్వైజర్ ట్రెయినీకి BBA, సోషల్ వర్క్, బిజినెస్ మేనేజ్‌మెంట్, BBS లేదా BMSలో రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఫైనాన్స్ పోస్టుల అభ్యర్థులు BCom రెగ్యులర్ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే దరఖాస్తుదారులు కనీసం 65 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి.  

ఇంజినీర్-ఎగ్జిక్యూటివ్ ట్రెయినీకి విద్యార్హతలు

ఇంజినీర్ పోస్టుల కోసం సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ BE - BTech డిగ్రీ, ఫైనాన్స్ అభ్యర్థులు CA లేదా CMA అర్హత, అలాగే హెచ్‌ఆర్- పర్సనల్ మేనేజ్‌మెంట్- ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ వర్క్ లేదా MBAలో ఫుల్ టైమ్ PG డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 

ఈ పోస్టుల భర్తీలో అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test) ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పోస్టుల భర్తీకి ఎంపిక చేస్తారు. 

ఎలా దరఖాస్తు చేయాలి?

  • ముందుగా అభ్యర్థులు BHEL అధికారిక వెబ్‌సైట్ careers.bhel.in కి వెళ్లండి. 
  • ఆ తరువాత కెరీర్ లేదా రిక్రూట్‌మెంట్ సెక్షన్‌కి వెళ్లాలి.
  • ఆ తర్వాత ఇంజినీర్ (Engineer)- ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ లేదా సూపర్వైజర్ ట్రెయినీ భర్తీ లింక్‌పై క్లిక్ చేయండి. 
  • ఆ తరువాత అక్కడ అడిగిన సమాచారం అందించి, రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయండి. 
  • ఆ తర్వాత ఫారంలో ఎడ్యుకేషన్, వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి. 
  • అవసరమైతే డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫారమ్‌కు పేమెంట్ చేయండి. 
  • చివరగా అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా వివరాలు చెక్ చేసి సబ్మిట్ చేయండి.