Just In

BEL: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు, ఎంపికైతే రూ.1.4 లక్షల వరకు జీతం
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 06 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

BEL Recruitment: చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఏఎంఐఈ, జీఐఈటీఈ, బీఎస్సీ(4 సంవత్సరాలు) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 06 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 23
రిజర్వేషన్: యూఆర్- 10 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 02 పోస్టులు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 06 పోస్టులు, ఎస్సీ- 04 పోస్టులు, ఎస్టీ- 01 పోస్టు.
* డిప్యూటీ ఇంజినీర్(ఇ-II) గ్రేడ్
విభాగాల వారీగా ఖాళీలు..
⏩ ఎలక్ట్రానిక్స్(ఈసీఈ): 11 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఏఎంఐఈ/జీఐఈటీఈ/బీఎస్సీ(4 సంవత్సరాలు) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 సంత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
⏩ మెకానికల్(ఎంఈసీహెచ్): 08 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఏఎంఐఈ/జీఐఈటీఈ/బీఎస్సీ(4 సంవత్సరాలు) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 సంత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది
⏩ కంప్యూటర్ సైన్స్(సీఎస్‌ఈ): 02 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఏఎంఐఈ/జీఐఈటీఈ/బీఎస్సీ(4 సంవత్సరాలు) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 సంత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది
⏩ సివిల్: 01 పోస్టు

⏩ ఎలక్ట్రికల్(ఈఈఈ): 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఏఎంఐఈ/జీఐఈటీఈ/బీఎస్సీ(4 సంవత్సరాలు) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 సంత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ.472(400 + జీఎస్టీ); ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
జీతం: నెలకు రూ.40,000- రూ.1,40,000.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.01.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.02.2025.
దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు..
➥ బర్త్ సర్టిఫికేట్ లేదా పదోతరగతి సర్టిఫికేట్(పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం)
➥ స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో
➥ అన్ని సర్టిఫికెట్లు (మెట్రిక్యులేషన్ / పదవ తరగతి / పీయూసీ / ఇంటర్/ డిగ్రీ)
➥ అన్ని సెమిస్టర్ మార్కు షీట్లు - బీఈ/బీటెక్/ఏఎంఐఈ/జీఐఈటీఈ/బీఎస్సీ(ఇంజినీరింగ్)
➥ క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికెట్
➥ యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ ద్వారా ధృవీకరించబడిన సీజీపీఏ /డీజీపీఏ /ఓజీపీఏ లేదా లెటర్ గ్రేడ్ టు పర్సంటేజ్ మార్కులు & అవార్డెడ్ క్లాసు మార్పిడి కోసం కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికేట్
➥ నిర్ణీత ఫార్మాట్‌లో కాస్ట్ సర్టిఫికేట్(ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్)
➥ దివ్యాంగులకు డిజబిలిటి సర్టిఫికేట్
➥ ప్రభుత్వ / పాక్షిక ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం చేస్తుంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్బ