భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.


వివరాలు...


బీడీఎల్‌ యూనిట్/ కార్యాలయాలు: కార్పొరేట్ ఆఫీస్ (గచ్చిబౌలి), కంచన్‌బాగ్ యూనిట్ (హైదరాబాద్), భానూర్ యూనిట్ (సంగారెడ్డి జిల్లా), ఇబ్రహీంపట్నం (రంగా రెడ్డి జిల్లా), విశాఖపట్నం యూనిట్‌ (ఏపీ), అమరావతి (మహారాష్ట్ర), లియాసిన్ ఆఫీస్ (న్యూ ఢిల్లీ).


* మొత్తం పోస్టుల సంఖ్య: 45.


మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్): 15 పోస్టులు


మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్): 12 పోస్టులు


మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 04 పోస్టులు


మేనేజ్‌మెంట్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్): 01 పోస్టు


మేనేజ్‌మెంట్ ట్రైనీ (సైబర్ సెక్యూరిటీ): 02 పోస్టులు


మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్): 02 పోస్టులు


మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్): 02 పోస్టులు


మేనేజ్‌మెంట్ ట్రైనీ (బిజినెస్ డీఈవీ.): 01 పోస్టు


మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఆప్టిక్స్): 01 పోస్టు


మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్): 02 పోస్టులు


వెల్ఫేర్‌ ఆఫీసర్‌: 02 పోస్టులు


జేఎం (పబ్లిక్ రిలేషన్స్): 01 పోస్టు


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 27.07.2023 నాటికి ఎంటీ (ఫైనాన్స్)/ వెల్ఫేర్‌ ఆఫీసర్‌/ జేఎం పోస్టులకు 28 సంవత్సరాలు; ఇతర ఖాళీలకు 27 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాల వెసులుబాటు ఉంది.


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.


పే స్కేల్: మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000. వెల్ఫేర్‌ ఆఫీసర్‌/ జేఎం రూ.30,000 - రూ.1,20,000.


ముఖ్యమైన తేదీలు...


* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 21.08.2023.


* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 20.09.2023.


* రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 2023/ జనవరి 2024.


Notificaion


Website


ALSO READ:


NLC India Ltd: ఎన్ఎల్‌సీఐఎల్‌లో 850 ట్రేడ్ అప్రెంటీస్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ & ఇతర ఖాళీలు
NLC India Ltd Apprentice 2023: నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్) ట్రేడ్ అప్రెంటీస్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల  చేసింది. దీనిద్వారా మొత్తం 850 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నావారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 16 వరకు దరకఖాస్తు చేసుకోవాలి. హార్డు కాపీలను ఆగస్టు 23 వరకు సంబంధిత చిరునామాకి పంపించాలి.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


సదరన్‌ రైల్వేలో 790 ఏఎల్‌పీ, టెక్నీషియన్, జేఈ పోస్టులు - అర్హతలివే!
Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ) సదరన్ రైల్వేలో పని చేయుటకు జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా ఏఎల్‌పీ/టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ & ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 790 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థల్లో 368 సైంటిస్ట్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
ASRB Recruitment: దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ICAR) ఆధ్వర్యంలోని పరిశోధన సంస్థలు/ కేంద్రాల్లో శాశ్వత ప్రాతిపదికన సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..