ముంబయిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) వివిధ విభాగాల్లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ, ఎంటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబరు 28లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు...
* రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు.
ఖాళీల సంఖ్య: 78
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంటెక్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
జీతం:
1. రిసెర్చ్ అసోసియేట్-1: నెలకు రూ.47000తో పాటు ఇతర అలవెన్సులు కల్పిస్తారు.
2. రిసెర్చ్ అసోసియేట్-2: నెలకు రూ.49000తో పాటు ఇతర అలవెన్సులు కల్పిస్తారు.
3. రిసెర్చ్ అసోసియేట్-3: నెలకు రూ.54000తో పాటు ఇతర అలవెన్సులు కల్పిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Deputy Establishment Officer,
Recruitment-V, Central Complex,
BARC, Trombay,
Mumbai- 400085.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 28.10.2022.
Notification & Application
Website
Also Read:
IRCTC: ఐఆర్‌సీటీసీలో అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండియన్ రైల్వే కేటరింగ్ & టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC)లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతిలో 50 శాతం మార్కులతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. 01.04.2022 నాటికి 15-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Railway Jobs: సదరన్ రైల్వేలో 3154 అప్రెంటిస్ ఖాళీలు, ఐటీఐ అర్హత!
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్ రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. షార్ట్‌లిస్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Railway Jobs: ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
కోల్‌కతాలోని తూర్పు రైల్వే , రైల్వే రిక్రూట్‌మెంట్‌సెల్ (ఆర్ఆర్‌సీ) తూర్సు రైల్వే పరిధిలోని వర్క్ షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ ఫిట్‌నెస్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..