ముంబయిలోని భారత అణు శక్తి విభాగం ఆధ్వర్యంలోని 'భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్' వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 24 నుంచి మే 22 లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులను ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు...
* పోస్టుల సంఖ్య: 4374
➦ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్: 212 పోస్టులు
1) టెక్నికల్ ఆఫీసర్/ సి: 181 పోస్టులు
అర్హతలు..
➥ ఎంఎస్సీ (బయోసైన్స్/లైఫ్ సైన్స్/బయోకెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/కెమిస్ట్రీ/ఫిజిక్స్).
➥ బీఈ/బీటెక్ (ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, మెకానికల్/ డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్), బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్స్/ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/మైనింగ్/ మెకానికల్/ మెటలర్జీ & మెటీరియల్స్/ మెటలర్జికల్ & మెటీరియల్స్).
➥ లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్ పోస్టులకు 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (లైబ్రరీ సైన్స్)తోపాటు నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
ప్రారంభ వేతనం: రూ.56,100.
2) సైంటిఫిక్ అసిస్టెంట్/ బి: 7 పోస్టులు
అర్హతలు: బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ/ హోంసైన్స్/న్యూటీషన్.
ప్రారంభ వేతనం: రూ.35,400.
3) టెక్నీషియన్/ బి: 24 పోస్టులు
అర్హత: పదోతరగతి, ఆపై విద్యార్హత ఉండాలి. బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉండాలి.
ప్రారంభ వేతనం: టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700.
➦ ట్రైనింగ్ స్కీమ్ (స్టైపెండరీ ట్రైనీ): 4162 పోస్టులు
1) కేటగిరీ-1: 1216 పోస్టులు
విభాగాలు: బయోకెమిస్ట్రీ, బయోసైన్స్, లైఫ్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, ఆర్కిటెక్చర్, సివిల్, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ సేఫ్టీ.
అర్హతలు: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా అర్హత ఉండాలి.
2) కేటగిరీ-2: 2946 పోస్టులు
విభాగాలు: ఫిట్టర్, టర్నర్/మెషినిస్ట్, వెల్డర్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్, డ్రాట్స్‌మ్యాన్(మెకానికల్), డ్రాట్స్‌మ్యాన్(సివిల్), మాసన్, ప్లంబర్, కార్పెంటర్, మెకానిక్ మోటార్ వెహికిల్, డీజిల్ మెకానిక్, ప్లాంట్ ఆపరేటర్, ల్యాబొరేటరీ, డెంటల్ టెక్నీషియన్-హైజినిస్ట్, డెంటల్ టెక్నీషియన్-మెకానిక్.
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో 60 శాతం మార్కులతో సర్టిఫికేట్ ఉండాలి. ప్లాంట్ ఆపరేటర్, డెంటల్ టెక్నీషియన్ పోస్టులకు హెచ్‌ఎస్‌సీ ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు ఉండాలి.
స్టైపెండ్: నెలకు కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000; కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు ఉంటుంది.
వయోపరిమితి: 22.o5.2023 నాటికి టెక్నికల్ ఆఫీసర్ 18-35 సంవత్సరాలు; సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18-30 సంవత్సరాలు; టెక్నీషియన్‌కు 18-25 సంవత్సరాలు; స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19-24 సంవత్సరాలు; స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఉద్యోగం అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.500; సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.150; టెక్నీషియన్ పోస్టులకు రూ.100; కేటగిరీ-1 పోస్టులకు రూ.150; కేటగిరీ-2 పోస్టులకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 24.04.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 22.05.2023.
Also Read:
గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న వెబ్‌నోట్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదల చేశారు. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 343 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 786 పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లి్క్ చేయండి..
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 132 ఆర్ట్ టీచర్ పోస్టులు, జీతమెంతో తెలుసా?
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 22 వెలువడింది. దీనిద్వారా 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 16 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 6 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 72 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో 38 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..