BEL Recruitment: బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 55 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 55
➥ ట్రైనీ ఇంజినీర్: 33 పోస్టులు
పోస్టుల కెటాయింపు: జనరల్-13, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-08, ఎస్సీ-05, ఎస్టీ-04.
విభాగాల వారీగా ఖాళీలు..
ఎలక్ట్రానిక్స్-26 పోస్టులు
మెకానికల్-03 పోస్టులు
కంప్యూటర్ సైన్స్-04 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కనీసం 06 నెలలు సంబంధిత పోస్టు అర్హత పారిశ్రామిక అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు మొదటి సంవత్సరం రూ.30,000. రెండవ సంవత్సరం రూ.35,000. మూడవ సంవత్సరం రూ.40,000.
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 22 పోస్టులు
పోస్టుల కెటాయింపు: జనరల్-10, ఈడబ్ల్యూఎస్- 06, ఓబీసీ-01, ఎస్సీ-03, ఎస్టీ-02.
విభాగాల వారీగా ఖాళీలు..
ఎలక్ట్రానిక్స్-16 పోస్టులు
కంప్యూటర్ సైన్స్-06 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కనీసం 2 సంవత్సరాల సంబంధిత పోస్టు అర్హత పారిశ్రామిక అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు మొదటి సంవత్సరం రూ.40,000. రెండవ సంవత్సరం రూ.45,000. మూడవ సంవత్సరం రూ.50,000. నాల్గొవ సంవత్సరం రూ.55,000.
దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.150 ప్లస్ 18% GST. ప్రాజెక్ట్ ఇంజినీర్: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.400 ప్లస్ 18% GST. ఎస్సీ, ఎస్టీ & పీడబ్ల్యుూబీడీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
వేతనం: నెలకు ట్రైనీ ఇంజినీర్‌కు రూ.30,000 - రూ.40,000, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.40,000 - రూ.55,000.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Manager (HR),
Product Development & Innovation Centre (PDIC),
Bharat Electronics Limited,
Prof. U R Rao Road, Near Nagaland Circle,
Jalahalli Post, Bengaluru – 560 013, India.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.02.2024.
ALSO READ:
ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో 120 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, వాక్-ఇన్ తేదీలివే!
BIOM Trade Apprentice Recruitment: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడలోని 'నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NMDC), బచేలి కాంప్లెక్స్‌లో పలు విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2 నుంచి 26 వరకు వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఖాళీలను భర్తీచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..