బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిలో మెడికల్ ఆఫీసర్, పీఆర్వో, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారిని న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాల్లో నియమిస్తారు.



వివరాలు..



పోస్టుల సంఖ్య: 54



1) మెడికల్ ఆఫీసర్: 06


2) మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం): 02


3) సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్): 01


4) పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO): 01


5) జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్): 02


6) ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటివ్): 01


7) యోగా థెరపిస్ట్: 02


8) స్టాఫ్ నర్స్: 12


9) పంచకర్మ టెక్నీషియన్: 13


10) ఆడియాలజిస్ట్: 01


11) ఆప్తాల్మిక్ టెక్నీషియన్/ ఆప్టోమెట్రిస్ట్: 01


12) ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ (ఆఫ్తాల్మిక్): 01


13) అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్: 01


14) పంచకర్మ అటెండెంట్: 10



అర్హత:
మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం), సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్), పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO), జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్), ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటివ్), యోగా థెరపిస్ట్, స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్ లో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. 



వయోపరిమితి: 
45 సంవత్సరాలు. ఆడియాలజిస్ట్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్/ ఆప్టోమెట్రిస్ట్ మరియు OT టెక్నీషియన్ (ఆఫ్తాల్మిక్) పోస్టులకు వయోపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. పంచకర్మ టెక్నీషియన్, అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్ మరియు పంచకర్మ అటెండెంట్ పోస్టులకు వయోపరిమితి 30 సంవత్సరాలు.



దరఖాస్తు విధానం: 
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 



ఎంపిక విధానం:
పోస్టులవారీగా నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.



దరఖాస్తు ఫీజు: 
జనరల్/ఓబీసీ/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్థులు రూ.750 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్థులు రూ.450 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.



జీతం:


* మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం), సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్) - రూ.75,000. 


* పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ - రూ. 70,000. 


* జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్), ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటివ్), యోగా థెరపిస్ట్‌ - రూ.50,000. 


* స్టాఫ్ నర్స్ - రూ.37,500


* పంచకర్మ టెక్నీషియన్ - రూ.24,000


* ఆడియాలజిస్ట్ - రూ.21,756


* ఆప్తాల్మిక్ టెక్నీషియన్/ ఆప్టోమెట్రిస్ట్, OT టెక్నీషియన్ (ఆఫ్తాల్మిక్) -  రూ.21,756


* అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్ - రూ.30,000


* పంచకర్మ అటెండెంట్ - రూ.16,000.
 
Notification


Online Application


Website


 


Also Read:


SSC - జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ 2022
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 12న నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..  



Also Read:

ITBP Constable Notification: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(పయోనిర్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...