BECIL Recruitment: బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) ఒప్పంద ప్రాతిపదికన ఎయిమ్స్ జమ్మూ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 407.


పోస్టులు: అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్, సివిల్, ఎలక్ట్రికల్), అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, బయో మెడికల్ ఇంజినీర్, చీఫ్‌ డైటీషియన్‌, చీఫ్‌ మెడికల్‌ రికార్డ్‌ ఆఫీసర్‌, చీఫ్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్, చీఫ్ ఫార్మసిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, కోడింగ్‌ క్లర్క్‌, CSSD ఆఫీసర్, CSSD సూపర్‌వైజర్, డీఈఓ, డిస్పెన్సింగ్ అటెండెంట్, డిసెక్షన్ హాల్ అటెండెంట్, మార్చురీ అసిస్టెంట్, డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), డ్రైవర్ గ్రేడ్ II, ఎలక్ట్రీషియన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AC & R), ఫోర్‌మాన్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్), గ్యాస్/ పంప్ మెకానిక్ (పే లెవల్-4), హెల్త్ ఎడ్యుకేటర్ (సోషల్ సైకాలజిస్ట్), జూనియర్ ఇంజినీర్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్), జూనియర్ ఇంజినీర్ (సివిల్), జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (రిసెప్షనిస్ట్), జూనియర్ టెక్నీషియన్ (ఆడియోమెట్రీ టెక్నీషియన్(ENT), ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ టెక్నికల్ అసిస్టెంట్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ గ్రేడ్, రేడియోథెరపీ టెక్నీషియన్ గ్రేడ్ I, టెక్నికల్ ఆఫీసర్(డెంటల్/డెంటల్ టెక్నీషియన్), టెక్నికల్ ఆఫీసర్ ఆప్తాల్మాలజీ(రిఫ్రాక్షనిస్ట్), రెస్పిరేటరీ/పల్మనరీ, డయాలసిస్ థెరపీ, ఎండోస్కోపీ, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్(EEG), అనస్థీషియా(ICU/OT/ట్రామా), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్, క్యాత్ ల్యాబ్, CTVS OT, ప్లాస్టర్), ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ II, లాండ్రీ మేనేజర్ 1, లీగల్ అసిస్టెంట్, లైబ్రేరియన్ గ్రేడ్ I, లైబ్రేరియన్ గ్రేడ్ III, మేనేజర్/ సూపర్‌వైజర్/గ్యాస్ ఆఫీసర్, మానిఫోల్డ్ రూమ్ అటెండెంట్, మెకానిక్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్, E & M), మెడికల్ రికార్డ్ ఆఫీసర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, మెడికో సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ I, మెడికో సోషల్ వర్కర్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (ఫిజియోథెరపిస్ట్), ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఆపరేటర్ (E & M)/ లిఫ్ట్ ఆపరేటర్, PACS అడ్మినిస్ట్రేటర్, ఫార్మసిస్ట్ గ్రేడ్ I, ఫార్మసిస్ట్ గ్రేడ్ II, ఫిజియోథెరపిస్ట్, ప్రైవేట్ సెక్రటరీ, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, పబ్లిక్ హెల్త్ నర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ II, శానిటేషన్ ఆఫీసర్, సీనియర్ డైటీషియన్ (ఫుడ్ మేనేజర్), సీనియర్ హిందీ ఆఫీసర్ (పే లెవల్-7), సీనియర్ మెకానిక్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్), సీనియర్ ఆపరేటర్ (ఈ & ఎమ్), సీనియర్ ప్లంబర్, సీనియర్ శానిటేషన్ ఆఫీసర్, స్టోర్ కీపర్, స్టోర్ కీపర్-కమ్-క్లర్క్, స్టోర్స్ ఆఫీసర్, సూపర్‌వైజింగ్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ (టెక్నికల్ సూపర్‌వైజర్) (ల్యాబ్), ట్రాన్స్‌పోర్ట్ సూపర్‌వైజర్, జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (అడ్మిన్, ఫైనాన్స్, స్టోర్స్ అండ్ ప్రొక్యూర్‌మెంట్, స్టాటిస్టిషియన్, గ్రాఫిక్ డిజైనర్, డ్రెస్సర్).


అర్హత: పోస్టును అనుసరించి పది, ఇంటర్మీడియట్‌, సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, పీజీ, ఐటీఐ, డిప్లొమా, ఎంబీఏ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంసీఏ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 


దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు రూ.590; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.295.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను సంబంధిత చిరునామాకు స్పీడ్‌ పోస్ట్‌/ రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా పంపించాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, స్కిల్‌ టెస్ట్/ ఇంటర్వ్యూ/అసెస్‌మెంట్ తదితరాల ఆధారంగా.


దరఖాస్తుకు జతచేయాల్సిన డాక్యుమెంట్లు..


➥ ఎడ్యుకేషనల్ / ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు.


➥ 10వ తరగతి, 12వ తరగతి సర్టిఫికెట్లు(వర్తిస్తే).


➥ పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం


➥ క్యాస్ట్ సర్టిఫికేట్


➥ వర్క్ ఎక్స్‌పీరీయన్స్ సర్టిఫికేట్(వర్తిస్తే)


➥ పాన్ కార్డ్ కాపీ


➥ ఆధార్ కార్డు కాపీ


➥ EPF/ESIC కార్డ్ కాపీ


➥ బ్యాంక్ పాస్‌బుక్. బ్యాంక్ ఖాతా వివరాలను పేర్కొన్న కాపీ.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
“Broadcast Engineering Consultants India Limited
(BECIL), BECIL BHAWAN, C-56/A-17, 
Sector-62, Noida-201307 (U.P)”.


ముఖ్యమైన తేదీలు..


✦ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.02.2025.


✦ దరఖాస్తుకు చివరి తేదీ: 25.02.2025.


Notification & Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..