పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేపుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


⏩ ఆఫీసర్ స్కేల్-3: 100


⏩ ఆఫీసర్ స్కేల్-2: 300 


అర్హత: 60శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు 25-38 సంవత్సరాలు. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.118.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


జీత భత్యాలు: నెలకు స్కేల్-3 పోస్టులకు రూ.63,840-రూ.78,230. స్కేల్-2 పోస్టులకు రూ.48,170-రూ.69,810.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13.07.2023.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.07.2023.


Notification


Website



ALSO READ:


ఎన్‌ఐఓహెచ్‌ అహ్మదాబాద్‌లో 54 టెక్నికల్ పోస్టులు, వివరాలు ఇలా!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్‌, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!
మధ్యప్రదేశ్‌ బాలాఘట్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


40,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం, టీసీఎస్‌ కీలక ప్రకటన!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 40,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటామని, ఈ లక్ష్యంలో కోత ఏమీ వేయబోవడం లేదని టీసీఎస్‌ స్పష్టం చేసింది. ‘ప్రాజెక్టుల వేగం మందగించడం వల్ల ఆఫర్‌ లెటర్‌ ఇచ్చిన వారిని కంపెనీలోకి ఆహ్వానం పలకడానికి కాస్త ఆలస్యం అవుతోంద’ని మానవ వనరుల అధిపతి అంగీకరించారు. కానీ ఆఫర్‌ లెటర్‌ అందుకున్న అందరినీ కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. కొద్దికాలంగా ఐటీ కంపెనీలు ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా.. ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఆలస్యం చేస్తుండడంతో చాలా మంది ఫ్రెషర్లు ఎపుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial