Bank of Maharashtra 195 Vacancies Notification: పుణెలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వివిధ విభాగాల్లోని 195 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 26 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుతోపాటు పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ సర్టిఫికేట్ కాపీలు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, దివ్యాంగులైతే PWD సర్టిఫికేట్ జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.118 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 195


⏩ ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ 
➥ డిప్యూటీ జనరల్ మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్) స్కేల్ VI: 01
➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్) స్కేల్ V: 01
➥ చీఫ్ మేనేజర్ (పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ & ICAAP) స్కేల్ IV: 01
➥ చీఫ్ మేనేజర్ (ఎంటర్‌ప్రైజ్ అండ్ ఆపరేషనల్ రిస్క్) స్కేల్ IV: 01
➥ చీఫ్ మేనేజర్ (మార్కెట్ రిస్క్) స్కేల్ IV: 01
➥ సీనియర్ మేనేజర్ (రిస్క్ అనలిటిక్స్ & రిస్క్ మేనేజ్‌మెంట్) స్కేల్ III: 10
➥ మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్) స్కేల్ II: 25


⏩ ఫారెక్స్ మరియు ట్రెజరీ
➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ట్రెజరీ (డొమెస్టిక్ మరియు ఫారెక్స్) స్కేల్ V: 01
➥ చీఫ్ మేనేజర్ (ఫారెక్స్) స్కేల్ IV: 01
➥ చీఫ్ మేనేజర్ (డొమెస్టిక్ ట్రెజరీ) స్కేల్ IV: 01
➥ సీనియర్ మేనేజర్ (ఫారెక్స్) స్కేల్ III: 10
➥ మేనేజర్ (ఫారెక్స్) స్కేల్ II: 25


⏩ ఐటీ / డిజిటల్ బ్యాంకింగ్ / సీఐఎస్‌ఓ/సీడీఓ
➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్) స్కేల్ V: 01
➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (డేటా ఆర్కిటెక్చర్) స్కేల్ V: 01
➥ చీఫ్ మేనేజర్ (ప్రాజెక్ట్/ప్రోగ్రామ్ మేనేజర్) స్కేల్ IV: 01
➥ చీఫ్ మేనేజర్ (Dev Ops మరియు API ఫ్యాక్టరీ) స్కేల్ IV: 01
➥ చీఫ్ మేనేజర్ (లీడ్ బిజినెస్ అనలిస్ట్) స్కేల్ IV: 01
➥ చీఫ్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) స్కేల్ IV: 01
➥ చీఫ్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్) స్కేల్ IV: 01
➥ మేనేజర్ (ఏపీఐ మేనేజ్‌మెంట్) స్కేల్ II: 04
➥ మేనేజర్ (డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్) స్కేల్ II: 04
➥ మేనేజర్ (ఐటీ సెక్యూరిటీ) స్కేల్ II: 05
➥ మేనేజర్ (నెట్‌వర్క్ &SEC) స్కేల్ II: 06
➥ మేనేజర్ (యూనిక్స్, లినక్స్) స్కేల్ II: 03
➥ మేనేజర్ (క్వాలిటీ అస్యూరెన్స్) స్కేల్ I: 03
➥ మేనేజర్ (డేటా అనలిటిక్స్) స్కేల్ I: 05
➥ మేనేజర్ (జావా డెవలపర్) స్కేల్ II: 04
➥ మేనేజర్ (మొబైల్ యాప్ డెవలపర్) స్కేల్ II: 03
➥ మేనేజర్ (వీఎం వేర్) స్కేల్ II: 02
➥ మేనేజర్ (DBA-MSSQL) స్కేల్ II: 02


⏩ ఇతర విభాగాలు
➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (క్రెడిట్) స్కేల్ V: 01
➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (క్రెడిట్) స్కేల్ V: 01
➥ చీఫ్ మేనేజర్ (క్రెడిట్) స్కేల్ IV: 28
➥ సీనియర్ మేనేజర్ (ఆర్థికవేత్త) స్కేల్ III: 02
➥ సీనియర్ మేనేజర్ (సెక్యూరిటీ) స్కేల్ III: 03
➥ సీనియర్ మేనేజర్ (లీగల్) స్కేల్ III: 10
➥ మేనేజర్ (లీగల్) స్కేల్ II: 10
➥ మేనేజర్ (హ్యూమన్ రిసోర్స్) స్కేల్ II: 03
➥ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 10


అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.118. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


జీతం: నెలకు స్కేల్-2 పోస్టులకు రూ.64,820-రూ.93,960, స్కేల్-3కు రూ.85,920 - రూ.1,05,280, స్కేల్-4కు రూ.1,02,300-రూ.1,20,940, స్కేల్-5కు రూ.1,20,940-రూ.1,35,020, స్కేల్-6 పోస్టులకు రూ.1,40,500-రూ.1,56,500.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
General Manager
Bank of Maharashtra,
HRM Department, “Lokmangal” 1501,
Shivajinagar, Pune 411 001


ముఖ్యమైన తేదీలు..


➥ ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.07.2024.


➥ ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.07.2024. 


Notification & Application


Website



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..