ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్, యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన వారిని అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్లో నియమిస్తారు. డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు...
యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ (ఏబీవైబీపీ) 2023 - పీజీ డిప్లొమా
* అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
అర్హతలు..
➥ కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
➥ గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతూ చివరి పరీక్షకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులూ ప్రోగ్రామ్‌కు అర్హులు. అయితే, అకాడమీలో చేరిన తర్వాత ఒరిజినల్ ఫైనల్ ఇయర్ మార్క్ షీట్ డిగ్రీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
➥ గ్రాడ్యుయేషన్ డిగ్రీ (10+2+3) తప్పనిసరి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ వీడియో ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాతపరీక్షలో భాగంగా వెర్బల్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రిటన్ ఇంగ్లిష్ టెస్ట్, లిజనింగ్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ప్రోగ్రామ్ స్వరూపం: ఈ కోర్సు కాలవ్యవధి 12 నెలలు. మొదటి ఆరు నెలలు క్యాంపస్ శిక్షణ, మూడు నెలలు ఇంటర్న్‌షిప్, చివరి మూడు నెలలు ఆన్-ది-జాబ్ శిక్షణ ఉంటుంది. ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత అభ్యర్థి బ్యాంకింగ్ ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్ విక్రయించే సేల్స్ పాత్రలో యాక్సిస్ బ్యాంక్‌లో చేరతారు.
➥ మొదటి ఆరు నెలలు(క్యాంపస్ ట్రెయినింగ్): ఇ-లెర్నింగ్ మాడ్యూల్స్, మోడల్ బ్రాంచ్ సిమ్యులేషన్స్ పవర్ టాక్ బై యాక్సిస్ లీడర్స్, కేస్ స్టడీస్, గ్రూప్ ప్రెజెంటేషన్, వాలంటీరింగ్ యాక్టివిటీస్, క్లాస్‌రూమ్ లెక్చర్స్, అసైన్‌మెంట్స్, టాక్స్ బై ఎక్సపర్ట్స్ ఫ్రం ఇండస్ట్రీస్, ఫీల్డ్ విజిట్స్, రోల్ ప్లేస్, ఫినాకిల్ ట్రైనింగ్ ఉంటుంది.
➥ మూడు నెలలు(ఇంటర్న్‌షిప్): లెర్నింగ్ అబ్జర్వేషన్, స్ట్రక్చర్డ్ ఇంటర్న్‌షిప్ డైరీ, హ్యాండ్ హోల్డింగ్ బ్రాంచెస్, మెంటార్‌షిప్.
➥ చివరి మూడు నెలలు: టీమ్ సపోర్ట్, మెంటారింగ్ బై సీనియర్స్, బిజినెస్ గోల్స్ నేర్పిస్తారు
కోర్సు ఫీజు: ప్రోగ్రామ్ మొత్తం రుసుము రూ.3,88,464. మొదటి టర్మ్ రూ.202,614 ప్రోగ్రామ్ ప్రారంభానికి ముందే చెల్లించాలి. ప్రోగ్రామ్ ప్రారంభమైన 75 రోజుల తర్వాత టర్మ్-2 ఫీజు రూ.1,85,850 చెల్లించాలి.
స్టైపెండ్: ప్రోగ్రామ్ సమయంలో మొదటి ఆరు నెలల్లో నెలకు రూ.5,000, తర్వాత రూ.12,000 చెల్లిస్తారు.
జీతభత్యాలు: ఏటా రూ.4.42లక్షలు చెల్లిస్తారు.
దరఖాస్తుకు చివరితేది: 12.02.2023
Also Read:
సీడాక్‌లో 570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 20లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..