న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఏఎస్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(ఎస్ఎంఎస్), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్టీవో) పోస్టుల భర్తీతో పాటు జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)-2023 నిర్వహణకు సంబంధించి ఉమ్మడి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 22 నుంచి ఏప్రిల్‌10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


* నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌)-2023


* స్పెషలిస్ట్ & సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్-2023


మొత్తం ఖాళీల సంఖ్య: 195.


పోస్టుల వారీగా ఖాళీలు..


1. సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(ఎస్‌ఎంఎస్‌): 163 పోస్టులు


2. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్‌టీవో): 32 పోస్టులు


విభాగాలు: అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ఎకనామిక్ బోటనీ అండ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, జెనెటిక్స్&ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్&టెక్నాలజీ, అనిమల్&బయోటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ సైన్స్ తదితరాలు.


అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 10.04.2023 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నెట్‌కు సంబంధించి 01.01.2023 నాటికి అభ్యర్థి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. దీనికి గరిష్ఠ వయోపరిమితి లేదు.


నెట్‌, ఎస్‌ఎంఎస్‌, ఎస్‌టీవో-2023 ఉత్తీర్ణత మార్కులు: యూఆర్‌ అభ్యర్థులకు 75.0 (50%), ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ 67.5 (45%), ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 60.0 (40%) సాధించాలి.


దరఖాస్తు ఫీజు:


నెట్‌కు రూ.1000. ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.


ఎస్‌ఎంఎస్‌, ఎస్‌టీవో పోస్టులకు యూఆర్, ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ:కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎస్‌ఎంఎస్‌, ఎస్‌టీవో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


జీత భత్యాలు: నెలకు ఎస్‌ఎంఎస్‌, ఎస్‌టీవో పోస్టులకు రూ.56,100 - రూ.1,77,500 ఉంటుంది.‌
ఎస్‌టీవోకు రూ.250. ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ/ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.


ముఖ్యమైన తేదీలు...


ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ ప్రారంభం: 22.03.2023.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2023.


ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: 26.04.2023 నుంచి 30.04.2023 వరకు.



Notification 


Website 


Also Read:


సీఆర్‌పీఎఫ్‌లో 9212 కానిస్టేబుల్‌ పోస్టులు, టెన్త్ అర్హతతో నెలకు రూ.69,100 వరకు జీతం!
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ విభాగాల్లో మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 424, తెలంగాణలో 301 ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్న పురుష/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...