హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. సికింద్రాబాద్‌లో అక్టోబరు 28న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ జరుగనుంది. ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆర్మీ సబ్ ఏరియా (TASA HQ) హెడ్‌క్వార్టర్, మేజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. అక్టోబరు 28న ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగమేళా ప్రారంభంకానుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని గోల్డెన్ పామ్ సైనిక్ భవన్ వేదికగా ఈ మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఫ్రెషర్స్‌తోపాటు, ఆర్మీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన నిరుద్యోగులు, వితంతు మహిళలు కూడా పాల్గొనవచ్చు. మేళాలో పాల్గొనదలచనివారు వేదిక వద్దే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ ఉద్యోగాలకు నియామకాలు..
సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ ఆఫీసర్లు, సెక్యూరిటీ సూపర్‌వైజర్లు, అడ్మిన్ ప్రొఫైల్, సీపీఏ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్(ఇంగ్లిష్/హిందీ), సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, సాఫ్ట్‌వేర్ ఇంప్లిమెంటేషన్, ఎలక్ట్రానిక్ ఇంజినీర్, సపోర్ట్ కేర్ కౌన్సెలర్(ఉమెన్), సాఫ్ట్‌వేర్ ట్రైనీ, బిజినెస్ డెవలపర్ మేనేజర్, జావా డెవలపర్, క్లస్టర్ మేనేజర్, ఫుల్‌స్టాక్ డెవలపర్, డీఎస్‌పీ ఇంజినీర్ (ఆల్ట్రాసోనిక్). అనుభవం, సామర్థ్యం ఆధారంగా జీతభత్యాలు నిర్ణయిస్తారు.
అర్హతలు..
2018, 2019, 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఏదైనా డిగ్రీ లేదా పీజీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగమేళాకు హాజరుకావచ్చు. 2023లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా హాజరుకావచ్చు. బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఏ, బీటెక్ (అన్నిబ్రాంచులు), బీఫార్మసీ, ఏదైనా పీజీ అర్హత ఉండాలి.
మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొంటున్న సంస్థలివే..
1) Orion Security Solutions Pvt Ltd
2) Innove solutions
3) TeamUltima Services Private Limited
4) SIS Securitites
5) Millennium Skills Assessors Pvt Ltd
6) Muthoot Finance
7) Sri Chaithanya
8) Wipro
9) Genpact
10) iLensys
11) Jobminar
12) Career Adviser
13) Beyond IT services
And few others
జాబ్ మేళాకు హాజరయ్యేవారు తీసుకురావాల్సినవి...
* రెజ్యూమ్ - 10 సెట్స్
* పదోతరగతి, ఇంటర్, డిగ్రీ/ పీజీ సర్టిఫికేట్లు.
* ఆధార్ కార్డు, పాన్ కార్డు
* పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
* వీలైనన్ని ఎక్కువ సర్టిఫికేట్ కాపీలు, ఫొటోలతో హాజరుకావడం ఉత్తమం.
ప్లేస్‌మెంట్ డ్రైవ్ వేదిక:
Golden Palm Sainik Bhavan(GPSB),
Maunda Market, Near Secunderabad Railway Station
:: Also Read ::
సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్‌లో 419 ఖాళీలు, ఈ అర్హతలుండాలి!
సికింద్రాబాద్‌లోని సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 23న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న వారు నవంబరు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 జీతం ఉంటుంది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..