ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 28న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే గ్రూప్-2 రాత పరీక్షకు సంబంధించిన కొత్త సిలబస్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకుగాను రెండు దశల రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు  ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) నిర్వహిస్తారు.


ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు ఎంపిక అవుతారు. ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం... 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.


మెయిన్స్‌లో రెండు పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులకు(మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం; పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 


ALSO READ:


 నిరుద్యోగులకు బిగ్ గుడ్‌న్యూస్! ఏపీలో గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఏపీలో గ్రూప్ - 1, గ్రూప్ - 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. మొత్తం 597 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవోను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ నుంచి త్వరలోనే విడుదల కానున్నాయి. గ్రూప్ - 1లో 89 పోస్టులు, గ్రూప్‌ - 2లో 508 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


 ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలో 100 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు
బెంగళూరులోని భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ) ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు 04, 07, 11, 14 వతేదీలో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 95 ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 95 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 07 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో 53 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
నాగ్‌పుర్‌లోని మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఈసీఎల్) ఆధ్వర్యంలో ఉన్న మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 53 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్‌, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..