ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) నిర్వహించే గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామకానికి ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఏపీపీఎస్సీ, ఏపీ సాంకేతిక విద్యామండలి నిర్వహించే సీపీటీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ లేకుండా గ్రూపు-2, గ్రూపు-3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ  నిబంధనలు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా తప్పనిసరిగా సీపీటీ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.


మొత్తం 100 మార్కులకు సీపీటీ నిర్వహించనున్నట్లు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులను.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 మార్కులు; బీసీలకు 35 మార్కులు, ఓసీలకు 40 మార్కులుగా నిర్ణయించారు. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాల్లో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే గ్రూపు-1 ఉద్యోగాలకు మాత్రం ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


Also Read:


EWS అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్- ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయసు ఐదేళ్ల సడలింపు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో(EWS) ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల్లో దరఖాస్తు చేసుకోవడానికి వారికి వయసులో సడలింపు ఇస్తూ ఊరట కల్పించింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాజీ సైనికులకు మాత్రమే ఉన్న ఈ వెసులుబాటు ఇప్పుడు EWS అభ్యర్థులకు కూడా వర్తించనుంది.  


ప్రభుత్వం ఉద్యోగమంటేనే చాలా ఏళ్ల శ్రమ. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియని పరిస్థితి. అందుకే నోటిఫికేషన్ వచ్చే వరకు పోరాడుతూనే ఉండాలి. నెలలు గడిచే కొద్ది చాలా మంది పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. చదివే సత్తా ఉన్నా.. పోటీని తట్టుకునే శక్తి ఉన్నప్పటికీ ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయసు మించిపోవడంతో వాళ్లంతా వేర్వేరు పనులు చేసుకోవాల్సి ఉంటుంది. 


ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, సైనిక ఉద్యోగ అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వయసు సడలింపు ఇస్తున్నాయి. వారి వారి కేటగిరిని బట్టి వయసు సడలింపు ఉంటుంది. అప్పటి వరకు వాళ్లు పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి సడలింపు లేని కారణంగా ఎలాంటి రిజర్వేషన్ లేని కేటగిరి అభ్యర్థులు నష్టపోతున్నారు. వారికి పోటీని తట్టుకొని ముందుకెళ్లే శక్తి ఉన్నప్పటికీ... వయసు కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఆర్థికంగా స్థితిమంతులైన వారు వేర్వేరు వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. అయితే ఆర్థికంగా వెనకుబడిన వాళ్లు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


ఎలాంటి రిజర్వేషన్లు వర్తించకుండా ఆర్థికంగా వెనుకబడి ఉన్న అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ సరికొత్త జీవో తీసుకొచ్చింది. EWSలో ఉద్యోగార్థులకు ఐదేళ్ల సడలింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా రిలీజ్ చేసింది. అటే ఇప్పుడు బీసీ,ఎస్సీ,ఎస్టీ తరహాలోనే ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్తఉలకు ఐదేళ్ల పెంపు ఉంటుంది. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగార్థులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ఉద్యోగాల కోసం 39 ఏళ్ల వరకు పోటీ పడవచ్చు. ఈ మరేకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. దీని వల్ల లక్షల మంది అభ్యర్థులకు ఉపశమనం లభించనుంది. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...