గతంలో జారీ చేసిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు రాత పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఆగస్టు 29న ప్రకటించింది. గెజిటెడ, నాన్-గెజిటెడ్ కేటగిరిలో కలిపి మొత్తం 17 నోటిఫికేషన్లకు సంబంధించిన తేదీలు ఇందులో ఉన్నాయి. తొమ్మిది నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పేపరును ఒకేరోజు (21.10.2022)న నిర్వహించబోతుంది. ఏడు నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్ స్టడీస్  (జీఎస్) పేపరును నవంబరు 7న, మరో నోటిఫికేషన్‌కు సంబంధించిన జీఎస్ పరీక్ష నవంబరు 9న నిర్వహించనున్నారు. పోస్టుల నేపథ్యానికి అనుగుణంగా సబ్జెక్టుల వారీగా పరీక్షలు వేర్వేరు తేదీల్లో జరగనున్నాయి. నోటిఫికేషన్లను గతంలో జారీ చేసినప్పటికీ తేదీలను ప్రకటించలేదు. ఆ పరీక్షల తేదీలు ఏపీపీఎస్సీ తాజాగా వెల్లడించింది.



గెజిటెడ్ పోస్టుల పరీక్షల షెడ్యూలు ఇలా..


➤ అక్టోబరు 19న మత్స్యాభివృద్ధి అధికారి పోస్టుకు ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3 పరీక్షలు నిర్వహిస్తారు. అదేరోజు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు పరీక్షలుంటాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.

➤ అక్టోబరు 20న పట్టు పరిశ్రమ అధికారి, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3 పరీక్షలు జరుగుతాయి.

➤ ఉద్యానాధికారి పోస్టుకు అక్టోబరు 18న క్వాలిఫైయింగ్ పరీక్ష, 20న ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3 పరీక్షలు ఉంటాయి.

➤ అక్టోబరు 21న మధ్యాహ్నం వ్యవసాయాధికారి, పోలీసు సర్వీస్  లోని టెక్నికల్ అసిస్టెంట్, ఏపీ సర్వే, భూ రికార్డుల సర్వీస్‌లోని అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి.

డివిజినల్ అకౌంట్స్ అధికారి(వర్క్స్)- గ్రేడ్-2 పోస్టుకు నవంబరు 3న ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3 పరీక్షలు నిర్వహించనున్నారు.

అక్టోబరు 21న జనరల్ స్టడీస్ పేపరు..
➤ అక్టోబర్ 21న ఉదయం మత్స్యాభివృద్ధి అధికారి, పట్టుపరిశ్రమ అధికారి, వ్యవసాయాధికారి, టెక్నికల్ అసిస్టెంట్, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్, ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, ఉద్యానాధికారి, సర్వే, భూ రికార్డుల సర్వీసుల అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు ఉంటాయి.

➤ నవంబరు 7న డివిజినల్ అకౌంట్స్ అధికారి(వర్క్స్)-గ్రేడ్-2 పోస్టుకు సంబంధించి ఉదయం జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది.


 


నాన్ గెజిటెడ్ పోస్టులకు...


➤అక్టోబరు 19న ఉదయం ఆహార భద్రత అధికారి పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తారు.


➤ నవంబరు 4న ఉదయం అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ అధికారి, మధ్యాహ్నం అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తారు.


➤ నవంబరు 5న ఉదయం వసతి గృహ అధికారి-గ్రేడ్  2 (మహిళలు) పోస్టుకు పరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం ఏపీ శాసనసభ సర్వీస్ కింద తెలుగు రిపోర్టర్ల పోస్టుకు పరీక్ష ఉంటుంది.


➤నవంబరు 6న జిల్లా పబ్లిక్ రిలేషన్ అధికారి పోస్టుకు సంబంధించిన రా పరీక్షను ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3 పరీక్ష నిర్వహిస్తారు.


➤నవంబరు 7న మధ్యాహ్నం మహిళా శిశు సంక్షేమశాఖకు సంబంధించిన విస్తరణాధికారి(గ్రేడ్-1)(సూపర్  వైజర్) పరీక్ష ఉంటుంది.


➤ నవంబరు 9న అటవీ శాఖకు చెందిన అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుకు క్వాలిఫైయింగ్ పరీక్ష,  నవంబరు 10న ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3,  నవంబరు 11న ఉదయం పేపర్-4 పరీక్షలు ఉంటాయి.


నవంబరు 7న జనరల్ స్టడీస్  
అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ అధికారి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి, వసతి గృహ అధికారి, తెలుగు రిపోర్టర్లు, జిల్లా పబ్లిక్ రిలేషన్ అధికారి, విస్తరణాధికారి(గ్రేడ్-1) పోస్టులకు జనరల్ స్టడీస్  , మెంటల్ ఎబిలిటీ పరీక్ష నవంబర్ 7న ఉదయం ఉంటుంది. నవంబరు 9న మధ్యాహ్నం అటవీశాఖ అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుకు, అక్టోబరు 21న ఉదయం ఆహార భద్రత అధికారి పోస్టుకు జనరల్ స్టడీస్ , మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహించనున్నారు.



పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి...



 


Also Read:


ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 207 టీచర్ పోస్టులు
AP DSC Notification: ఏపీలోని ఆదర్శ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా పీజీటీ, టీజీటీ, ఆర్ట్  ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 17 వరకు ఫీజు చెల్లించి, ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


ఏపీ ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీ పాఠశాలల్లో 214 టీచర్‌ పోస్టులు


ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, సంగీత ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 17 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 18 వరకు కొనసాగనుంది. రాతపరీక్ష (టీఆర్టీ, టెట్ కమ్ టీఆర్టీ) ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఏపీటెట్ వెయిటేజీ ఉంటుంది. 


నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


AP IEDSS: ఏపీ ఐఈడీఎస్‌ఎస్‌ ప్రత్యేక విద్యలో 81 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు


ఏపీలో దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక విద్యకు సంబంధించి సెకండరీ స్టేజీ(ఐఈడీఎస్‌ఎస్‌)లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్(ప్రత్యేక విద్య) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభంకానుంది. దరఖాస్తుకు చివరితేది సెప్టెంబరు 18. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 24 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...