APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌

APPSC Group 2 Exams 2025: ఆదివారం గ్రూప్‌2 పరీక్ష వాయిదా లేదని ప్రకటించడంతో అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. కేంద్రాలకు త్వరగా చేరుకోవాలని చెబుతోంది.

Continues below advertisement

APPSC Group 2 Exams 2025: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూపు 2 మెయిన్స్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. తప్పుడు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా ప్రసక్తే లేదని ప్రభుత్వానికి తేల్చి చెప్పినందున అసలు ఏర్పాట్లపై ఫోకస్ చేసింది. 

Continues below advertisement

ఆదివారం రెండు పూట్ల పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 92 వేల మంది అభ్యర్థుల కోసం 175 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి పేపర్‌ ఉంటుంది. ఉదయం 9.30 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులకే ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇస్తారు. 9.45 గంటలకి గేట్లు మూసేస్తారు. సాయంత్రం 3:00 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో పేపర్ ఉంటుంది. రెండున్నర నుంచి 2.45 మధ్యే అభ్యర్థులకు పరీక్ష కేంద్రానికి అనుమతి ఉంటుంది. తర్వాత వచ్చిన వారిని లోపలికి రానివ్వరు.  

Also Read: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన

గ్రూప్‌ 2 పరీక్ష జరిగే కేంద్రాల చుట్టూ వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే మాత్రం కేసుల్లో ఇరుక్కుంటారని ఏపీపీఎస్సీ హెచ్చరించింది. పరీక్ష కేంద్రానికి పరిధిలో ఉన్న షాపులు అన్నింటిని మూసివేయనున్నారు. పరీక్షలు ఎలాంటి ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌ కానీ, ఇతర వస్తువులు కానీ తీసుకురావద్దని సూచించింది.  

రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి సరి చేసేందుకు పరీక్ష పోస్ట్‌పోన్ చేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఏపీపీఎస్సీ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆందోళన తీవ్ర తరం చేశారు. అభ్యర్థులకు అన్యాయం చేసేలా నిర్వహిస్తున్న పరీక్షను బాయ్‌కాట్ చేస్తున్నామని అన్నారు. కచ్చితంగా ఇది కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదని.... ఒకవేళ ఎవరైనా ఉద్యోగాల్లో జాయిన్ అయినా సరే వాళ్లకు ఉద్యోగ భద్రత ఉండదని అంటున్నారు. కోర్టుల జోక్యంతో మళ్లీ పరీక్ష పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.  

Also Read: గ్రూప్‌ 2 వివాదంలో ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ

Continues below advertisement
Sponsored Links by Taboola