APPSC Group2 Results: ఏపీలో గ్రూప్‌-2 ప్రాథమిక పరీక్ష (Prelims) ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు వారం రోజుల్లో వెలువడనున్నట్లు ఏపీపీఎస్సీ స‌భ్యుడు ప‌రిగె సుధీర్ ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదిక‌గా వెల్లడించారు. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 1:100 నిష్పత్తి ప్రకారం మెయిన్ పరీక్షకు (Group2 Mains) ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 897 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు. జూన్‌ లేదా జులైలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు.


కటాఫ్ ఎంత ఉండొచ్చు..?
పోస్టుల సంఖ్యను అనుసరించి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ జనరల్ కేటగిరి కటాఫ్ 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


గ్రూప్-2 మెయిన్ పరీక్ష విధానం..



ఆంధ్రప్రదేశ్‌‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జవనరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 


ALSO READ:


APPSC: వెబ్‌సైట్‌లో 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ, ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం
ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పేపర్-1, పేపర్-2 ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌‌సై‌ట్‌లో ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నిర్ణీత ఫార్మాట్‌లో ఆన్‌లైన్ ద్వారా మార్చి 19 నుంచి మార్చి 21 వరకు అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17న స్క్రీనింగ్‌ పరీక్ష పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో మొత్తం 1,26,068 (84.67 %)  మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో   పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 %) మంది, పేపర్-2 పరీక్షకు 90,777 (72 %) మంది అభ్యర్థులు హాజరయ్యారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...